వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

National Population Register: ఎందుకు? పూర్తి వివరాలు, నో డాక్యుమెంట్స్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ జాతీయ జనాభా రిజిస్టర్(నేషనల్ పాపులేషన్ రిజిస్టర్-ఎన్‌పీఆర్)కు ఆమోద ముద్ర వేసింది. అంతేగాక, ఈ కార్యక్రమం కోసం రూ. 8,500 కోట్లను ఖర్చు చేయనుంది. ఎన్పీఆర్ అంటే దేశంలోని పౌరుల పేర్లు, వివరాలు నమోదు చేసే కార్యక్రమం. ఇందుకోసం ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

జనాభా లెక్కలు నిర్వహించే ముందు ఈ జాతీయ జనాభా రిజిస్టర్ కార్యక్రమాన్ని సాధారణంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా నిర్ణయం తీసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.

2004లో యూపీఏ ప్రభుత్వం.. 1955 సిటిజెన్‌షిప్ యాక్ట్‌కు సవరణ చేసింది. ఈ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని ప్రతి పౌరుడిని రిజిస్టర్ చేస్తుంది. అంతేగాక, వారికి జాతీయ గుర్తింపు కార్డులను దీని ద్వారా అందజేస్తుంది. ఈ మేరకు సవరణలో చేర్చడం జరిగింది. ఇంతకుముందు 2010, 2015లో కూడా ఈ జాతీయ జనాభా రిజిస్టర్ కార్యక్రమం జరిగింది. గత సర్వేల ఆధారంగా ఇప్పుడు మరోసారి తాజా సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది.

నేషనల్ పాపులేషన్ రిజిస్టర్‌కు కేబినెట్ ఆమోదం: ఎన్పీఆర్ అంటే ఏంటీ? పశ్చిమబెంగాల్, కేరళ నో!నేషనల్ పాపులేషన్ రిజిస్టర్‌కు కేబినెట్ ఆమోదం: ఎన్పీఆర్ అంటే ఏంటీ? పశ్చిమబెంగాల్, కేరళ నో!

ఎన్‌పీఆర్ ఏం చేస్తుంది?

ఎన్‌పీఆర్ ఏం చేస్తుంది?

గ్రామాలు/పట్టణాలు, సబ్ జిల్లాలు, జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన ప్రజల వివరాలను జాతీయ జనాభా రిజిస్టర్ సేకరిస్తుంది. ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ప్రభుత్వాలు తీసుకొచ్చే పథకాలు పారదర్శకంగా, సమర్థవంతంగా లబ్ధిదారులైన ప్రజలకు చేర్చడంలో కీలకంగా ఉంటుందీ ఎన్పీఆర్.

ఎన్‌పీఆర్ డేటా అనేది సోషియో-ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్(ఎస్ఈసీసీ) ఆధారంగా పనిచేస్తుంది. లబ్ధిదారులను ఎంపిక చేయడం కోసం ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆయుష్మాన్ భారత్, జన్ ధన్ యోజన, ప్రధానమంత్రి అవాస్ యోజన, ఉజ్వల యోజన, సౌభాగ్య లాంటి సంక్షేమ పథకాలు అసలైన లబ్ధిదారులకు చేరేలా ఈ ఎన్‌పీఆర్ ఉపకరిస్తుంది.

ఎన్‌పీఆర్ ద్వారా సేకరించిన ప్రజల సమాచారాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలకు అందజేయడం జరుగుతుంది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిశా, మణిపూర్‌లలో సర్వమ్, పీడీఎస్ స్కీంలు, రాజస్థాన్‌లో భమషాహ్‌లకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రస్తుతం ఎన్ఆర్సీ అమలుకు సంబంధించిన ఎలాంటి ప్రక్రియ ప్రారంభం కాలేదు. అనుమానాస్పద వ్యక్తుల పేర్లను ఎన్‌పీఆర్ ద్వారా సేకరించడం జరగదు. ఎన్‌పీఆర్, ఎన్ఆర్సీకి అసలు సంబంధమే లేదు. ఎన్‌పీఆర్ ద్వారా బయోమెట్రిక్ సేకరించడం లేదు. పాస్‌పోర్టు నెంబర్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, మొదలైన వాటి సమాచారం ఇవ్వడం తప్పనిసరి ఏమీ కాదు. స్వచ్ఛందంగా ఇవ్వవచ్చు.

ఎన్‌పీఆర్ ఎలా ప్రారంభమైంది?

ఎన్‌పీఆర్ ఎలా ప్రారంభమైంది?

కార్గిల్ రివ్యూ కమిటీ(కేఆర్సీ) సిఫార్సులను పరిశీలించేందుకు 2000 సంవత్సరంలో అటల్ బీహారీ వాజపేయి నేతృత్వంలోని మంత్రులు గ్రూప్ ఏర్పాటు చేశారు. భారతదేశంలో అక్రమంగా నివసించే వారిని గుర్తించేందుకు దేశ పౌరుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఈ మంత్రుల గ్రూప్ తేల్చింది. భారతదేశ పౌరులకు మల్టీ పర్పస్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్(ఎంపీఎన్ఐసీ), భారత పౌరులు కానివారికి విభిన్న రంగు, డిజైన్‌లో ఐడెంటిటీ కార్డును అందజేయాలని నిర్ణయించింది. ఈ సిఫార్సులను 2001లో ప్రభుత్వం ఆమోదించింది.

2003లో రిజిస్ట్రేషన్, జాతీయ గుర్తింపు కార్డులను జారీ చేసే అంశంపై పౌరసత్వ నిబంధనల పూర్తి ప్రక్రియను ప్రారంభించారు. 2004లో యూపీఏ ప్రభుత్వం 1955 పౌరసత్వ చట్టాన్ని సవరించింది. ఈ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని ప్రతి పౌరుడి వివరాలను రిజిస్టర్ చేస్తుంది. అంతేగాక, వారికి జాతీయ గుర్తింపు కార్డులను అందజేస్తుంది. ఈ మేరకు సవరణలో చేర్చడం జరిగింది.

ఈ చట్టం ప్రకారం నేషనల్ రిజిస్ట్రేషన్ అథారిటీ/రిజిస్ట్ర్ జనరల్ ఆఫ్ సిటిజన్ రిజిస్ట్రేషన్‌ను ఇండియా రిజిస్ట్రేటర్ జనరల్ రూపొందించడం జరిగింది.

 2003-2009 (ఎన్డీఏ ప్రభుత్వం + యూపీఏ ప్రభుత్వం)

2003-2009 (ఎన్డీఏ ప్రభుత్వం + యూపీఏ ప్రభుత్వం)

ఈ క్రమంలో దేశంలోని ఎంపిక చేసిన సరిహద్దు ప్రాంతాల్లో మల్టీపర్పస్ నేషనల్ ఐడెంటిటీ కార్డులను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. జనాభా రిజిస్టర్, సిటిజన్ రిజిస్టర్ ప్రక్రియలను పైలట్ ప్రాంతాల్లో అమలు చేసే సమయంలో పలు సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో టెక్నాలజీని ఉపయోగించి పద్ధతి ప్రకారం చేయాలని చేయాలని నిర్ణయించారు.

నేషనల్ రోలౌట్(యూపీఏ ప్రభుత్వం), అక్టోబర్ 2006

పైలట్ ప్రాజెక్టు అనుభవాల ఆధారంగా నేషనల్ రోలౌట్ ఆఫ్ ఎంఎన్ఐసీ కోసం ప్రతిపాదనలను కమిటీ ఆఫ్ సెక్రటరీస్(సీఓఎస్)కు అక్టోబర్ 2006లో అప్పగించడం జరిగింది. జాతీయ స్థాయిలో ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేసేందుకు నిర్ణయించారు.
ఈ క్రమంలో ఎస్ఓఎస్ కింది ప్రతిపాదనలను చేసింది..

పౌరసత్వ నిర్ణయం: సంక్లిష్టమైన విషయం కావడంతో దశలవారీగా తీసుకోవచ్చు.

ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్(ఈ-జీవోఎం ), యూపీఏ ప్రభుత్వం(2009-11) సిఫార్సులను 2011 జనాభా లెక్కల సమయంలో పరిగణలోకి తీసుకున్నారు.

ముంబై దాడుల తర్వాత తీర ప్రాంతాల భద్రతపై ప్రభుత్వం మరోసారి ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలో ఎన్పీఆర్ ద్వారా సమాచారాన్ని సేకరించి, 65.50లక్షల నివాసులకు రెసిడెన్సీ ఐడెంటిటీ కార్డులను జారీ చేశారు.

 దేశంలో ఎన్పీఆర్ (యూపిఏ ప్రభుత్వం) 2010

దేశంలో ఎన్పీఆర్ (యూపిఏ ప్రభుత్వం) 2010

దేశంలోని పౌరుల సమాచారాన్ని ఇంటింటికి తిరిగి సేకరించే ప్రక్రియకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 2011లో బయోమెట్రిక్ ద్వారా వివరాలను సేకరించాలని నిర్ణయించారు.

 ఎన్పీఆర్ అప్డేషన్(ఎన్డీఏ ప్రభుత్వం) 2015-16

ఎన్పీఆర్ అప్డేషన్(ఎన్డీఏ ప్రభుత్వం) 2015-16

అస్సాం, మేఘాలయా రాష్ట్రాలను మినహాయించి దేవంలోని అన్ని రాష్ట్రాల్లో ఎన్పీఆర్ ద్వారా వివరాలను సేకరించడం జరిగింది. ఇందులో కొన్ని వివరాలను ఎక్కువగా సేకరించడం జరిగింది.

English summary
The Narendra Modi cabinet on Tuesday approved the updation of the National Population Register (NPR). It is a routine process being conducted to update the National Population Register, which will further supplement the upcoming census exercise and also help provide targeted benefits under various welfare programs of the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X