చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జీన్స్, పొట్టి లంగాలు వేసుకున్న... మహిళలకు నో డ్రైవింగ్ లైసెన్స్

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ అధికారులు ఎప్పుడు ఎం చేస్తారో ఎవ్వరికి అర్థం కాదు. తాము ప్రజల సేవకు ఉన్నామనే కనీస ఆలోచన పక్కన పెట్టి, తమకు ఇష్టం వచ్చిన నిబంధనలు ప్రజలపై రుద్దుతారు. ఓక్కోసారి ఏ ప్రభుత్వంలో అమలు పరచని నిబంధనలతో ప్రజలకు ఇబ్బంది కల్గిస్తారు. తామే వ్యవస్థకు బాసులుగా వ్యవహరిస్తారు. తమకు తోచిందే రూలుగా ఆర్డర్‌ వేస్తారు. దీంతో వింత వింతగా వ్యవహరించి ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు దేశంలో రోజు ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉంటాయి.

జీన్స్ వేసుకుంటే నో డ్రైవింగ్ టెస్ట్

జీన్స్ వేసుకుంటే నో డ్రైవింగ్ టెస్ట్

ఈ కోవలోనే చెన్నైలోని ఓ ఆర్టీఏ అధికారి వింత నిబంధనలు పెట్టాడు. దేశంలో ఎక్కడ లేని విధంగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం ధరఖాస్తు చేసినవాళ్లు టెస్ట్‌లో భాగంగా జీన్ పాయింట్స్ వేసుకుంటే అనుమతి లేదని చెబుతున్నారు. అదికూడ ఆధునిక సమాజంలో మహిళలు వేసుకునే జీన్స్ అసలే వద్దని చెప్పాడు. దీంతో చేసేదేమి లేక డ్రైవింగ్ టెస్ట్‌ కోసం అక్కడి అధికారులు చెప్పినట్టే చేయాల్సిన దుస్థితి చెన్నైలోని కేకే నగర్ ఆర్టీఏ పరిధిలోని ప్రజలకు నెలకొంది. కాగా ఆధునిక సమాజంలో జీన్ ప్యాంట్స్ సర్వసాధారణం అయిపోయిన కాలంలో కూడ అధికారులు ఇలాంటీ నిబంధనలు పెట్టడం విడ్డూరంగా కనిపిస్తుంది.

చెన్నై కేకే నగర్‌ ఆర్టీఏలో వింత నిబంధనలు

చెన్నై కేకే నగర్‌ ఆర్టీఏలో వింత నిబంధనలు

చైన్నైలోని కేకే నగర్‌ ఆర్టీఏ అధికారులు ఈ నిబంధనలు పెట్టారు. డ్రైవింగ్ టెస్ట్ కోసం ఎలాంటీ డ్రెస్ కోడ్ లేనప్పటికి ప్రత్యేకంగా కేకే నగర్ ఆర్టీఏ అధికారులు మాత్రం విధించారు. యువతులు జీన్‌పాంట్ వేసుకుని డ్రైవింగ్ టెస్ట్‌కు వెళ్లినా... స్లీవ్‌లెస్ టాప్‌ ధరించినా.. పోట్టి లంగాలు వేసుకున్నా... ఆర్టీఏ అధికారులు వెనక్కి పంపిస్తున్నారు. వేరే ఇతర దుస్తులు ధరిస్తేనే డ్రైవింగ్ టెస్ట్‌కు అనుమతి ఇస్తున్నారు. మహిళలతో పాటు మగవారు కూడ సాధరణ లుంగీ, షార్ట్ వేసుకొని వెళుతున్న వారిని కూడ ఆర్టీఓ అధికారులు వెనక్కి పంపుతున్నారు.

సమర్ధించుకుంటున్న అధికారులు

సమర్ధించుకుంటున్న అధికారులు

అయితే చెన్నై కేకే నగర్‌‌లో ఇలాంటీ సంఘటనలు, నిబంధనలు విధిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నా... అవి కొనసాగుతున్నాయి. గతంలో కూడ ఇక్కడి అధికారులు తిక్క, తిక్క నిబంధనలు పెట్టి ప్రజలకు ఇబ్బందులకు గురి చేశారనే ఫిర్యాదులు ఉన్నాయి. అయితే ఈ ఫిర్యాదులను పట్టించుకోని అధికారులు మాత్రం తాము పెడుతున్న నిబంధనలు సమర్ధించుకుంటున్నారు. దీంతో డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేసేది ప్రభుత్వ కార్యాలయం కాబట్టి ఇక్కడకు వచ్చే వారు కూడ సరైన దుస్తులు ధరించి రావాలని కోరుతున్నారు. అలా మంచి దుస్తుల్లో రావడం వల్ల తప్పు లేదని ఆర్టీఓ అధికారి సమర్ధించుకుంటున్నారు.

English summary
no driving test who wear the jeans and other clothes kk nagar rto office in chennai.and imposes new rules for driving test.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X