వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్కరోజే...3 సినిమాలు రూ. 120 కోట్లు వసూలు చేశాయి..! ఇంకా ఆర్ధిక మందగమనం ఎక్కడిది..?

|
Google Oneindia TeluguNews

దేశంలో నెలకొన్న ఆర్ధికమందగమనంపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో ఆర్దిక మందగమనం లేదని ఇందుకు సాక్ష్యం ఇటివల విడుదలైన సినిమాలే కారణమని చమత్కరించారు. ఆక్టోబర్‌ 2న విడుదలైన మూడు సినిమాలు ఒక్కరోజే 120 కోట్ల రుపాయాలు వసూలు చేశాయని అన్నారు. ఆర్ధిక మందగమనం లేదనడానికి సినిమాల కలెక్షన్లే నిదర్శమని అన్నారు.

భారత దేశవ్యాప్తంగా ఆర్ధిక మందగమనం అనేక రంగాలను కుదేలు చేస్తున్న విషయం తెలిసిందే, దీంతో కేంద్రం ప్రభుత్వం దీన్ని అధిగమించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. పన్నులు తగ్గించడంతో పాటు, బ్యాంకుల విలీనం లాంటీ ప్రక్రియలను చేపట్టిన విషయం తెలిసిందే.. అయితే ఇందుకు విరుద్దంగా కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ చమత్కరించారు. ఢిల్లీలోని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సమయంలో ఆర్ధిక మందగమనం గురించి స్పందించాలని అడిగారు.

no economic slowdown at all : Ravi Shankar Prasad

దీంతో ఆయన నవ్యుతూ దేశంలో ఆర్ధిక మందగమనం లేదని అన్నారు. తాను ఆటల్ బిహారీ వాజ్‌పేయి హాయంలో సమాచార శాఖ మంత్రిగా చేశానని, దీంతో సినిమాల గురించి కొంత అవగాహన ఉందని చెప్పిన ఆయన నేషనల్ హలీడే అయిన అక్టోబర్ 2 విడుదలైన మూడు సినిమాలు ఒక్కరోజులోనే 120 కోట్ల రుపాయాలను వసూలు చేశాయని అన్నారు. ఇలా సినిమాలు వాణిజ్యపరంగా బాగా అభివృద్ది చెందాయని, ఇది చాల శుభపరిణామామని చెప్పారు. కాగా అక్టోబర్ రెండున జాతీయవ్యాప్తంగా విడుదలైన సైరా తోపాటు వార్, మరియు జోకర్ సినిమాలు విజయవంతంగా నడుస్తున్న విషయం తెలిసిందే.

English summary
Three movies collectively earned Rs 120 crore on October 2 and so, there's no economic slowdown at all union minister Ravi Shankar Prasad said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X