వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో లొల్లి: తాత్కాలిక సీబీఐ బాస్‌గా నాగేశ్వరరావు నియామకం సరికాదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్

|
Google Oneindia TeluguNews

సీబీఐలో ఏర్పడిన ముసలం ఇంకా కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు సీబీఐ వివాదం సుప్రీంకోర్టుకు ఎక్కగా కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మ బాధ్యతలు చేపట్టడం... బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటలకే ఆయన్ను మరో శాఖకు బదిలీ చేయడం, ఆ తర్వాత ఆయన తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయడం అన్ని చకాచకా జరిగిపోయాయి. అనంతరం అడిషనల్ డైరెక్టర్‌గా ఉన్న నాగేశ్వరరావును జనవరి నెల వరకు మధ్యంతర సీబీఐ బాస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు కేంద్రం జారీ చేసింది.ఈ క్రమంలోనే మరోసారి సీబీఐ వార్తల్లో నిలిచింది.

సీబీఐ డైరెక్టరుగా నాగేశ్వరరావు నియామకాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ఎన్జీఓ సంస్థకు చెందిన ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ డైరెక్టర్ నియామకం పారదర్శకతతో జరగాలని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సీబీఐ డైరెక్టరుగా నాగేశ్వరారావు పేరును హైపవర్ సెలెక్షన్ కమిటీ సూచించలేదని ఆయన నియామకం నేరుగా జరిగిందని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.

No end in sight: Now Rao’s appointment as interim CBI chief challenged

ఇక నాగేశ్వరరావు నియామకం పూర్తి పారదర్శకతతో జరగలేదని అంజలి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏకపక్షంగా జరిగిన నాగేశ్వరరావు నియామకం చెల్లదని ఆమె అన్నారు. ఇవి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని అంజలీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశాంత్ భూషణ్ ద్వారా వేశారు.

English summary
CBI's additional director Rao was given the charge of CBI interim chief on January till the appointment of a new director after a high-powered committee headed by Prime Minister Narendra Modi removed Alok Verma as the chief of the probe agency on charges of corruption and dereliction of duty.The petition, filed by NGO Common Cause and RTI activist Anjali Bhardwaj, has sought laying down of specific mechanisms to ensure transparency in the process of appointment of CBI director.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X