వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్ళి చేసుకొన్న పురుషులకు ఆ దేవాలయంలో ప్రవేశం లేదు, వెళ్తే కాపురాలు కుప్పకూలుతాయి

వివాహం చేసుకొన్న పురుషులు రాజస్థాన్ లోని పుష్కర్ ఆలయానికి వెళ్తే వారి కాపరం కుప్పకూలుతోందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ పురాణాల ఆధారంగా ఇప్పటికీ కూడ ఈ ఆలయంలోకి వివాహం చేసుకొన్న పురుషులను అనుమ

By Narsimha
|
Google Oneindia TeluguNews

పుష్కర్ : కొన్ని దేవాలయాల్లోకి పురుషులకు అనుమతించరు, మరికొన్నింటిలోకి స్త్రీ లను అనుమతించరు. విచిత్రమేమిటంటే రాజస్థాన్ లోని ఓ దేవాలయంలో వివాహమైన పురుషులను అనుమతించరు. ఒకవేళ వివాహమైన వారు ఈ దేవాలయంలోకి ప్రవేశిస్తే వారి కాపురం కుప్పకూలుతోందట.అందుకే ఈ దేవాలయంలోకి బ్రహ్మచారులను మాత్రమే అనుమతిస్తారు.

రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్ లో బ్రహ్మకు ఆలయం ఉంది. బ్రహ్మకు ఉన్న ఏకైక దేవాలయంగా దీనికి గుర్తింపు ఉంది. అయితే ఈ గుడిలోకి పెళ్ళైన పురుషులను అనుమతించరు.

అయితే ఒకవేళ ఈ దేవాలయంలోకి వివాహం చేసుకొన్న పురుషులు వెళ్తే వారి కాపురాల్లో నిప్పులు తప్పవని స్థానికులు చెబుతారు. అందుకే వివాహం అయిన వారిని ఈ దేవాలయంలో ప్రవేశించకుండా అడ్డుకొంటారు.ఈ దేవాలయంలోకి వివాహం చేసుకొన్న పురుషులను రాకుండా అడ్డుకొనేందుకు పెద్ద కారణమే ఉందని పురాణాలు చెబుతున్నాయి.

jents

ఈ పురాణాల కథల ప్రకారంగానే వివాహం చేసుకొన్న పురుషులను మాత్రం ఈ దేవాలయంలోకి అడుగుపెట్టనివ్వబోని స్థానికులు చెబతున్నారు. తమ పూర్వుల కాలం నుండి ఇదే పద్దతిని పాటిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

పుష్కర్ ప్రాంతంలోనే బ్రహ్మ యాగం నిర్వహించాడు. ఈ యాగ సమయానికి బ్రహ్మ సతీమణి సరస్వతి రాలేదు. యాగం ఆలస్యమౌతోందనే కారణంగా బ్రహ్మ గాయత్రిని వివాహం చేసుకొన్నాడు. సమయానికి సరస్వతి రాలేదు, యాగం నిర్వహించేందుకు బ్రహ్మకు భార్య ఉండాలి. యాగ సమయం మించిపోతోందని భావించి బ్రహ్మ గాయత్రిని వివాహం చేసుకొన్నాడు.గాయత్రితో కలిసి బ్రహ్మ యాగాన్ని పూర్తి చేశాడు.

యాగం పూర్తయ్యే సమయానికి అక్కడికి సరస్వతి వచ్చింది. యాగం పూర్తి కావడమే కాకుండా, గాయత్నిని బ్రహ్మ వివాహం చేసుకొన్న విషయాన్ని ఆమె తెలుసుకొని తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేసింది.దీంతో ఆమె శాపం ఇచ్చిందని పురాణాలు చెబుతారు. పెళ్ళైన మగవారు ఈ దేవాలయాన్ని దర్శిస్తే వారి వైవాహిక జీవితం నాశనమౌతోందని శపించింది. దీంతో ఈ దేవాలయానికి వివాహం చేసుకొన్న పురుషులు ఎవరూ కూడ వెళ్ళేందుకు సాహసించరు. ఒకవేళ సాహసించిన గుడి పాలకవర్గం అడ్డుచెబుతోంది.
అందుకే ఈ దేవాలయంలోకి బ్రహ్మచారులను మాత్రమే అనుమతిస్తారు.

English summary
no entry to married jents in to pushkar temple in rajastam. there is a history.god brahma conduct yagam , in time brahma wife saraswathi didnot came to this pushar place for particate yagam, at that time brahma marry gayatri, along with gayatri brahma completed yagam , after completed yagam saraswati came to pushkar place.she get information about brahma marrage, she angry , married jents enter in to the temple, their marrage life collapse said saraswati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X