వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరుషి హత్య కేసు: సినిమా, పుస్తకానికి తల్లిదండ్రులు నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

No film or book on Aarushi case will be allowed: Talwars
లక్నో: తమ కుమార్తె ఆరుషి హత్యపై ఎలాంటి సినిమా, పుస్తకాన్ని ప్రస్తుతం జైల్లో ఉన్న ఆమె తల్లిదండ్రులు రాజేష్ తల్వార్, నూపుర్ తల్వార్‌లు అనుమతించబోరని, ఒక వేళ ఎవరైనా వారి అనుమతి లేకుండా అలాంటి ప్రయత్నం చేసినట్లయితే వాళ్లు న్యాయపరమైన చర్యను ఎదుర్కోవలసి ఉంటుందని తల్వార్ దంపతుల లాయరు ఆదివారం చెప్పారు.

ఈ అంశంపై మీడియాలో వచ్చిన వార్తలు ఈ దంపతులను ఎంతో ఆందోళనకు గురి చేశాయని, ఆరుషి కేసుపై హాలీవుడ్, లేదా బాలీవుడ్ సినిమా తీయడానికి వాళ్లు అనుమతించరని తల్వార్ దంపతుల న్యాయవాది మనోజ్ సిసోడియా అన్నారు.

కొంతమంది అంతర్జాతీయ, జాతీయ సినీ దర్శకులు, రచయితలు ఆరుషి కేసుపై సినిమా తీయాలని, పుస్తకం రాయాలని అనుకుంటున్నట్లు మీడియా వార్తల ద్వారా తమకు తెలిసిందని, తాము ఎంతగానో ప్రేమించే తమ కుమార్తె హత్యపై సినిమా తీసి డబ్బులు సంపాదించాలని కొంతమంది అనుకోవడం రాజేష్, నూపుర్‌లను ఎంతో ఆవేదనకు గురి చేసిందని సిసోడియా అన్నారు.

ఆరుషి హత్య కేసులో తమను దోషిగా పేర్కొనడంపై వాళ్లు ఇంకా షాక్‌కు లోనయి ఉన్నారని, వారిని ఓదార్చడం సాధ్యం కావడం లేదన్నారు. తల్వార్ దంపతుల అంగీకారం లేకుండా ఆరుషి కేసుపై సినిమా తీసినట్లయితే సంబంధిత డైరెక్టర్లు, రచయితలపై వాళ్లు చట్టపరంగా చర్య తీసుకుంటారని కూడా ఆయన చెప్పారు.

English summary
Jailed dentist couple Rajesh and Nupur Talwar will "not allow" any film or book on the murder of their daughter Aarushi and anyone taking up such a venture without their consent will face legal action, their lawyer said on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X