వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.50వేలకు పన్ను: చంద్రబాబు సూచనలపై నిర్ణయం తీసుకోలేదన్న కేంద్రం

రూ.50 వేల కంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటే ట్యాక్స్ వేయాలని.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్యానల్ చేసిన సూచనల పైన ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రూ.50 వేల కంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటే ట్యాక్స్ వేయాలని.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్యానల్ చేసిన సూచనల పైన ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది.

ఎంబీ డేటా ఫ్రీ, రూ.50వేలు దాటితే పన్ను: మోడీకి బాబు సూచనలుఎంబీ డేటా ఫ్రీ, రూ.50వేలు దాటితే పన్ను: మోడీకి బాబు సూచనలు

మంగళవారం సాయంత్రం చంద్రబాబు నేతృత్వంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, సిక్కిం సీఎం పవన్ చామ్లింగ్‌, నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షులు అరవింద్‌ పనగడియా, సీఈఓ అమితాబ్‌కాంత్‌లతో కూడిన కమిటీ డిజిటల్‌ చెల్లింపులపై ప్రధానికి మధ్యంతర నివేదిక సమర్పించింది.

chandrababu naidu

ఇకమీదట అన్నిరకాల డిజిటిల్‌ చెల్లింపులను పూర్తిగా ఉచితం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులు, కొత్తగా సమకూర్చాల్సిన మౌలిక వసతులు, రిజర్వ్ బ్యాంక్‌ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సవివర నివేదికను ఈ కమిటీ ప్రధానికి అందించింది.

ప్రధానంగా బ్యాంకుల నుంచి రూ.50వేలకుమించి నగదు ఉపసంహరించుకుంటే క్యాష్ హ్యాండ్లింగ్‌ ఛార్జీ విధించాలని సూచించింది. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది.

దీని పైన ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. కమిటీ సిఫార్సులను పరిశీలిస్తున్నామని, పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. చంద్రబాబు నేతృత్వంలో కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందన్నారు.

English summary
The Finance Ministry on Wednesday clarified that a final call on the recommendations of the panel of Chief Ministers, which includes a tax on cash transactions above Rs 50,000, is yet to be made.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X