వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫైజర్ వ్యాక్సిన్‌ కోసం భారత్ చర్చలు -అందరికీ టీకాలకు టైమ్ లైన్ లేదు -ఇప్పటికే రూ.10వేల కోట్ల ఖర్చు

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం తగ్గుముఖం పట్టినా, మూడో దశ వెల్లువెత్తొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం. ఇప్పటికే దేశంలో నాలుగు టీకాలకు అనుమతివ్వగా, అమెరికాకు చెందిన ఫైజర్ సంస్థతోనూ చర్చలు జరుగుతున్నాయని, 18 ఏళ్లు దాటిన అందరికీ టీకాలను అందించడానికి టైమ్ లైన్ పెట్టుకోలేదని కేంద్రం తెలిపింది. కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ కు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాడవీయ శుక్రవారం పార్లమెంటులో కీలక ప్రకటనలు చేశారు..

Recommended Video

Finnish Nurse Extracts 7 Doses From Pfizer Vial || Oneindia Telugu

జగన్ మరో సంచలనం: ఏపీలో నూతన విద్యా విధానం -ఆగస్టు16న స్కూళ్ల రీఓపెన్ -గత రెండేళ్ల 10th‌కూ మార్కులుజగన్ మరో సంచలనం: ఏపీలో నూతన విద్యా విధానం -ఆగస్టు16న స్కూళ్ల రీఓపెన్ -గత రెండేళ్ల 10th‌కూ మార్కులు

18 ఏళ్లు నిండిన అందరికీ టీకాలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని, అయితే, వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తికి ఫలానా గడువు(టైమ్ లైన్)ను నిర్ధారించుకోలేదని ఆరోగ్య మంత్రి మాండవీయ లోక్ సభకు సమాధానమిచ్చారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 135 కోట్ల టీకాల డోసులు అందుబాటులోకి వచ్చినట్లవుతుందని, అయితే, ఈ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ఎప్పుడు ముగుస్తుందనడానికి ఎటువంటి కచ్చితమైన సమయం లేదని.. డిసెంబర్‌ చివరినాటికి 18ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సిన్‌ అందుతుందని మంత్రి తెలిపారు.

No fixed timeline to complete covid vaccination, Talks With Pfizer: Health Minister in LS

దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ల కొరత లేదని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడంలో ఎటువంటి ఆలస్యం చేయడం లేదని మంత్రి స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన ఫైజర్‌ వ్యాక్సిన్‌తో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతూనే ఉందని.. లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు.

షాకింగ్: జగన్ సర్కార్ అప్పులపై కాగ్ దర్యాప్తు -ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ వినతి -జైలు శిక్ష తప్పదంటూషాకింగ్: జగన్ సర్కార్ అప్పులపై కాగ్ దర్యాప్తు -ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ వినతి -జైలు శిక్ష తప్పదంటూ

కరోనా వైరస్‌, వ్యాక్సిన్‌ సంబంధిత అంశాలపై రాజకీయాలు చేయొద్దని మంత్రి మాండవీయ ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. కొవిడ్‌-19 సమస్యలు, వ్యాక్సిన్‌ విధానంపై ప్రధాని మోదీ ఇప్పటికే సీఎంలతో 20సార్లు భేటీ అయ్యారని, నిర్ణయాలన్నీ సమిష్టిగానే తీసుకుంటున్నామని మంత్రి గుర్తుచేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం ఇప్పటివరకు రూ.9,725కోట్లను ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు.

English summary
Vaccination is an ongoing and a dynamic process, and therefore, a fixed timeline cannot be given for the completion of the COVID-19 immunisation drive but those above 18 years of age are expected to be vaccinated by December 2021, Union Health Minister Mansukh Mandaviya informed the Lok Sabha on Friday. Expert Group In Talks With Pfizer For Vaccine Supply, said Health Minister
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X