వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీహార్ జైలుకు కొత్త తలనొప్పి: నిర్భయ నిందితులకు ఉరి వేసేందుకు దొరకని తలారి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పలు కేసుల్లో దోషులుగా నిర్థారణ అయిన తర్వాత ఉరిశిక్ష పడిన నిందితులను ఉరితీయాలంటే తీహార్ జైలు సిబ్బందికి తలనొప్పిగా మారింది. కోర్టు తీర్పు బాగానే ఉంది.. అన్ని సదుపాయాలు ఉన్నాయి... కానీ ఉరి తీసేందుకు మాత్రం తలారి దొరకడం లేదు. చివరిసారిగా 2012లో తీహార్ జైలులో పార్లమెంటుపై దాడి చేసిన కేసులో నిందితుడు అఫ్జల్ గురును ఉరి తీశారు. అప్పుడు కూడా తలారిని దొరకపట్టడంలో చాలా శ్రమించారు పోలీసులు. తాజాగా నిర్భయ కేసులో కూడా నిందితులను ఉరి తీయాల్సి ఉండగా తీహార్ జైలు సిబ్బంది తలారిని వెతికే పనిలో పడ్డారు.

 'నిర్భయ దోషులను వెంటనే ఉరితీయాలి’: మరో జడ్జీకి బదిలీ చేసిన ఢిల్లీ కోర్టు 'నిర్భయ దోషులను వెంటనే ఉరితీయాలి’: మరో జడ్జీకి బదిలీ చేసిన ఢిల్లీ కోర్టు

నిర్భయ ఘటనలో నిందితులకు ఉరి

నిర్భయ ఘటనలో నిందితులకు ఉరి

2012లో జరిగిన అత్యంత పాశవిక చర్య నిర్భయపై సామూహిక అత్యాచారం. దేశం యావత్తును కదిలిచిన ఈ ఘటనలో సుప్రీంకోర్టు నిందితులకు ఉరిశిక్షను విధించింది. ఇక శిక్ష అమలు చేసేందుకు సమయం దగ్గర పడుతుండటంతో తీహార్ జైలు సిబ్బందికి నిందితులకు ఉరివేసే తలారి దొరకడం లేదు. నిర్భయ కేసులో నిందితుడిగా ఉన్న వినయ్ శర్మ క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ను కోరగా...ఆ పిటిషన్‌ను తిరస్కరించడం జరిగింది. అయితే ఇందులో మరో ముగ్గురు నిందితులు ముఖేష్, పవన్ మరియు అక్షయ్‌లు క్షమాభిక్ష పిటిషన్‌కు దరఖాస్తు చేసుకోలేదు.

అతి పెద్ద జైలుకు లేని తలారి

అతి పెద్ద జైలుకు లేని తలారి


ఇక తీహార్ జైలు దక్షిణాసియాలోనే అతి పెద్ద జైలు. అయితే ఒక తలారి లేకపోవడం అక్కడి పోలీస్ సిబ్బందికి తలనొప్పిగా మారింది. దీంతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒకరిని నియమించుకోవాలని జైలు సిబ్బంది భావిస్తోందట. ఇదిలా ఉంటే మరో నెల రోజుల సమయంలో నిర్భయ కేసులో నిందితులను ఉరి తీసే అవకాశం ఉందని సమాచారం. అఫ్జల్ గురును ఉరి తీసే సమయంలో కూడా జైలు సిబ్బంది తలారి లేక చాలా ఇబ్బందులు పడ్డట్టు తెలుస్తోంది.

తలారి కోసం వేట మొదలెట్టిన సిబ్బంది

తలారి కోసం వేట మొదలెట్టిన సిబ్బంది

తలారి కోసం దేశవ్యాప్తంగా ఉన్న జైళ్ల అధికారులను సంపద్రిస్తున్నామని తీహార్ జైలు సిబ్బంది వెల్లడించింది. అయితే అఫ్జల్ గురును ఉరి తీసే సమయంలో ఉత్తర్ ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో ఉన్న తలారిని తీసుకొచ్చామని ఇప్పుడు అతనిని సంప్రదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తీహార్ జైలు వర్గాలు వెల్లడించాయి. అయితే ఎప్పుడో ఎవరికో ఒకరికి ఉరి పడుతుంది కాబట్టి ఆ ఒక్కరికోసం తలారిని నియమించుకోలేము కదా అని జైలు సిబ్బంది చెబుతోంది.

క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్

క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్


ఇదిలా ఉంటే వినయ్ శర్మ పెట్టుకున్న మెర్సీ పిటిషన్‌ను ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తిరస్కరించారు. అంతకుముందు ఢిల్లీ ప్రభుత్వం కూడా తిరస్కరించింది. ఇప్పుడు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఈ ఫైలును కేంద్ర హోంశాఖకు పంపుతారు. అక్కడి నుంచి ఫైలు రాష్ట్రపతి వద్దకు వెళుతుంది. ఒకవేళ రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే అది వెంటనే జైలు అధికారులకు తెలపడం జరుగుతుంది. ఒకవేళ రాష్ట్రపతి ఆమోదం తెలిపితే.. జైలు అధికారులు కోర్టు నుంచి బ్లాక్ వారంట్ తీసుకురావాల్సి ఉంటుంది. 2012లో వినయ్ శర్మ, ముఖేష్, రామ్ సింగ్, అక్షయ్‌తో పాటు మరో మైనర్ బాలుడు నిర్భయ పై సామూహిక అత్యాచారం చేశారు. తీవ్రంగా గాయపడిన నిర్భయ చికిత్స పొందుతూ మృతి చెందింది. 2018లో ఢిల్లీ హైకోర్టు విధించిన ఉరిశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది.

English summary
Years after the hanging of Parliament attack convict Afzal Guru, the Tihar Jail administration is yet again grappling with finding a hangman.The development comes after Delhi Lieutenant Governor recommended rejecting the mercy plea of Nirbhaya gangrape convict Vinay Sharma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X