బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యూఎస్, యూరప్ హెల్మెట్లు వద్దు: ఐఎస్ఐ మార్కు: ఫిబ్రవరి 1: బెంగళూరు పోలీస్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలో బైక్ లో సంచరించే వారు ఇక ముందు కచ్చితంగా ఐఎస్ఐ మార్కు ఉన్న హెల్మెట్లు మాత్రమే వేసుకుని సంచరించాలని ట్రాఫిక్ విభాగం పోలీసులు సూచించారు. ఐఎస్ఐ మార్కు లేని హెల్మెట్లు వేసుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ విభాగం పోలీసు అధికారులు హెచ్చరించారు.

యూఎస్, యూరప్ హెల్మెట్

యూఎస్, యూరప్ హెల్మెట్

యునైటెడ్ స్టేట్స్ (యూఎస్), యూరప్ (ఈసీఈ)లో తయారు చేసిన హెల్మెట్లు ఉపయోగించరాదని, ఆదేశాల్లో తయారు చేసిన హెల్మెట్ లకు నాణ్యతలేదని, ఐఎస్ఐ మార్కు ఉన్న హెల్మెట్ లు మాత్రమే వేసుకోవాలని బెంగళూరు ట్రాఫిక్ విభాగం అడిషనల్ పోలీసు కమిషనర్ ఆర్. హితేంద్ర చెప్పారు.

ఐఎస్ఐ మార్కు ఉండాలి

ఐఎస్ఐ మార్కు ఉండాలి

బెంగళూరు నగరంలో బైక్ లు నడిపేవారు, వెనుకకుర్చున్న వారు కచ్చితంగా ఐఎస్ఐ మార్కు ఉన్న హెల్మెట్ లు ధరించాలని, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుని అపరాధరుసుం విధిస్తామని ట్రాఫిక్ విభాగం పోలీసులు హెచ్చరించారు.

టోపీ హెల్మెట్ లు

టోపీ హెల్మెట్ లు

టోపీలాగా అర్దం మాత్రమే ఉన్న హెల్మెట్ లు ఎట్టిపరిస్థితుల్లో అనుమతించమని బెంగళూరు ట్రాఫిక్ విభాగం పోలీసులు చెప్పారు. బైక్ లో సంచరించే వారు టోపీ గుర్తు ఆకారంలో ఉన్న హెల్మెట్ లు వేసుకున్నా ఒక్కటే, వేసుకోకున్నా ఒక్కటే అని ట్రాఫిక్ విభాగం పోలీసులు చెప్పారు.

 ఫిబ్రవరి 1 డెడ్ లైన్

ఫిబ్రవరి 1 డెడ్ లైన్

బెంగళూరు నగరంలో బైక్ లో సంచరించే వారు కచ్చితంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఐఎస్ఐ మార్కు ఉన్న హెల్మెట్లు ధరించాలని బెంగళూరు ట్రాఫిక్ విభాగం పోలీసులు సూచించారు. ఐఎస్ఐ మార్కు లేని హెల్మెట్ లు వేసుకుంటే కచ్చితంగా అపరాధ రుసుం విధిస్తామని ట్రాఫిక్ విభాగం పోలీసులు హెచ్చరించారు.

స్పాట్ లో ఇస్తాం

ఐఎస్ఐ హెల్మెట్ లు వేసుకోకుండా బైక్ లో సంచరించే వారిని అడ్డుకుని సంఘటనా స్థలంలోనే ఐఎస్ఐ మార్కు ఉన్న హెల్మెట్ లు ఎమ్ఆర్ పీ ధరకు ఇవ్వడానికి తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని, హెల్మెట్లు ఇప్పటికే సేకరిస్తున్నామని ట్రాఫిక్ విభాగం పోలీసులు తెలిపారు.

ఉచితంగా హెల్మెట్

ఉచితంగా హెల్మెట్

కర్ణాటక గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎం. క్రిష్ణప్ప, ఆయన కుమారుడైన శాసన సభ్యుడు ప్రియా క్రిష్ణ జనవరి 26వ తేదీన బెంగళూరు నగరంలోని విజయనగరలో ఉచితంగా ఐఎస్ఐ మార్కు ఉన్న హెల్మెట్ లు పంపిణి చేస్తారని, అవసరం అయిన వారు వెళ్లి తీసుకోవచ్చని ట్రాఫిక్ విభాగం పోలీసులు తెలిపారు.

English summary
Bengaluru traffic police have turned over-zealous with their crackdown on substandard helmets by suggesting that ones that meet global standards - such as United States' DoT and Europe's ECE - are not acceptable. Only riders who wear ISI-marked helmets will not be penalized when the rule comes into force from February 1, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X