వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ర్యాంకులు: టాప్ 100లో ఒక్కటీ లేదు, 200లో రెండు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మొదటి 100 యూనివర్సిటీల్లో భారతదేశానికి చెందిన ఓ ఒక్క యూనివర్సిటీకి కూడా దక్కలేదు. క్యూఎస్‌ ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌-2015 జాబితాను మంగళవారం విడుదల చేసింది.

భారత్‌కు చెందిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎస్‌సీ)-బెంగళూరు 147వ ర్యాంకును సాధించగా, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)-ఢిల్లీ 179 స్థానాల్లో నిలిచాయి. గతేడాది ర్యాంకింగ్స్‌లో ఐఐటీ ఢిల్లీ 235వ స్థానంలో ఉంది.

ఇక, టాప్‌ 400 యూనివర్సిటీల్లో దాదాపు 7 భారతీయ యూనివర్సిటీలకు చోటు దక్కింది. గతేడాది లాగే మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(అమెరికా) మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది నాల్గవ స్ధానంలో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీ రెండో స్ధానంలో నిలిచింది.

No Indian University in QS Top 100 World Varsities List

లండన్‌ కేంబ్రిడ్జి యూనివర్సిటీ, స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. ప్రపంచ స్థాయి ఉన్నత విద్యనందించడంలో గ్రేట్ బ్రిటన్ ముందు వరుసలో ఉంది. టాప్‌-50లో నాలుగు లండన్‌ యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయి.

ఆ తర్వాత బోస్టన్‌, న్యూయార్క్‌కు చెందిన 3, సిడ్నీ, హాంగ్‌కాంగ్‌, బీజింగ్‌కు చెందిన 2 చొప్పున యూనివర్సిటీలు టాప్‌-50లో స్థానం సంపాదించాయి. మొత్తంగా టాప్‌-200లో 34 దేశాలకు చెందిన విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకున్నాయి.

English summary
Massachusetts Institute of Technology (MIT) has retained its position as the leading varsity in the world while no Indian institution could make it to the top 100, according to a global university ranking released today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X