వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలో టాప్ 100 యూనివర్సిటీల జాబితా: భారత్ నుంచి ఒక్కటీ లేదు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఒకప్పుడు నలంద, తక్షశిల లాంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో ప్రపంచంలో విద్యకు కేంద్రంగా ఉన్న ఇండియా, నేడు ప్రపంచ ప్రఖ్యాత 100 విశ్వవిద్యాలయాల్లో చోటు దక్కించుకోలేకపోయింది.

టైమ్స్ ఉన్నత విభాగం 2015 సంవత్సరానికి విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో హార్వర్డ్ యూనివర్సిటీ మొదటి స్ధానంలో నిలవగా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ రెండో స్ధానంలో, హార్వర్డ్ యూనివర్సిటీ మూడో స్ధానంలో నిలిచాయి.

No Indian Varsity Makes it to List of Top 100 Prestigious University

బ్రిక్ దేశాల్లో భారత్‌కు తప్ప బ్రెజిల్, రష్యా, చైనాకు చెందిన యూనివర్సిటీలకు స్ధానం దక్కింది. "తమ యూనివర్సిటీలకు దీనిలో స్ధానం లభించకపోవడం ... ఎంతో ఘన చరత్రి కలిగిన, ఆర్ధికంగా అభివృద్ధి చెందిన భారత్‌కు ఆందోళన చెందాల్సిన పరిణామం" అని టైమ్స్ ఉన్నత విద్య విభాగం ఎడిటర్ ఫిల్ బాటీ అన్నారు.

ఇక ఐదేళ్లుగా హార్వర్డ్ యూనివర్సిటీ మొదటి స్ధానాన్ని కాపాడుకుంటూ వస్తుంటే, స్టాన్ ఫోర్డ్, మసాచూట్స్ యూనివర్సిటీలను వెనక్కినెట్టి కేంబ్రిడ్జ్, ఆక్స్ ఫోర్డ్‌లు తమ స్ధానాలను మెరుగుపరచుకున్నాయి.

జాబితాలో టాప్ టెన్ యూనివర్సిటీల్లో అమెరికాకు చెందినవే ఎక్కువగా ఉన్నాయి. మొదటి 50లో 26, 100లో 43 అమెరికా యూనివర్సిటీలకు దీనిలో చోటు లభించింది.

English summary
None of the Indian universities could make it to the list of top 100 most prestigious global universities in the latest 'world reputation ranking' by Times Higher Education.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X