వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ గ్యాంగ్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు: మంత్రి కిషన్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

తుకుడే తుకుడే గ్యాంగ్ అని వస్తున్నవార్తలపై కేంద్ర ప్రభత్వం వద్ద ఎలాంటి సమాచారం లేదని పార్లమెంటుకు తెలిపారు హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. అంతేకాదు తుకుడే తుకుడే గ్యాంగ్ అనే పదం ఎలా పుట్టుకొచ్చిందో తనకు తెలియదని చెప్పారు. పోనీ ఏమైనా విచారణా సంస్థలు దీనిగురించి ప్రస్తావించాయా అని లోక్‌సభలో ప్రశ్నించారు కిషన్ రెడ్డి.

కాంగ్రెస్ ఎంపీలు విన్సెంట్ హెచ్ పాలా మరియు జస్బీర్‌ సింగ్ గిల్‌లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కిషన్ రెడ్డి చెప్పారు. తుకుడే తుకుడే గ్యాంగ్ పేరుతో ఏదైనా సంస్థ ఉందా అని కాంగ్రెస్ ఎంపీలు విన్సెంట్ హెచ్ పాలా, జస్బీర్‌సింగ్‌లు ప్రభుత్వాన్ని సభలో ప్రశ్నించారు. పోనీ ఏదైనా సమాచారంతో ఈ పదాన్ని కేంద్ర హోంశాఖ చేర్చిందా అని ప్రశ్నించారు. అంతేకాదు తుకుడే తుకుడే గ్యాంగ్‌లో ఉన్న సభ్యుల గురించి విచారణా సంస్థలు ఎక్కడైనా జాబితాను సిద్ధం చేశారా అని ప్రశ్నించారు.

No info on any group called Tukude Tukude gang:MoS KishanReddy

గత నెలలో కూడా తుకుడే తుకుడే గ్యాంగ్‌ పై స్పష్టత ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద పిటిషన్ దాఖలైంది. తుకుడే తుకుడే గ్యాంగ్‌కు మూలం ఏంటి..? ఒకవేళ ఉంటే ఎందుకు నిషేధించలేదు ? ఇందులో సభ్యులు ఎవరు తెలపాలని కోరుతూ ఆర్టీఐ ద్వారా పిటిషన్ దాఖలైంది. దీంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు షాక్ తిన్నారు. సమాజానికి చేటు కలిగించే సంస్థలు, నిషేధిత సంస్థలకు సంబంధించిన అన్ని అంశాలు హోంశాఖ పరిధిలోకి వస్తాయి.

2016లో జేఎన్‌యూ విద్యార్థులు క్యాంపస్‌లో కొన్ని స్లోగన్లు ఇచ్చినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారని అయితే ఆ విద్యార్థులకు ఎలాంటి గ్యాంగులతో సంబంధం లేదని, తుకుడే తుకుడే గ్యాంగ్‌పై ప్రభుత్వం వద్ద కానీ ప్రభుత్వ పరిధిలో పనిచేసే విచారణా సంస్థల వద్దకానీ ఎలాంటి రికార్డు నమోదు కాలేదని ఓ అధికారి చెప్పారు. 2016లో జేఎన్‌యూ విద్యార్థులను ఉద్దేశిస్తూ ఈ పదం వాడటం జరిగింది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో బీజేపీ నేతలు ఈ పదాన్ని వాడుతున్నారు. అది కూడా తమ ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తున్న సమయంలో తుకుడే తుకుడే గ్యాంగ్ అనే పదాన్ని వినియోగిస్తున్నారు. ఇక పలు ర్యాలీల్లో పాల్గొన్న ప్రధాని మోడీ అమిత్ షాలు కూడా తుకుడే తుకుడే పదాన్ని వినియోగించారు. వారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఈ పదప్రయోగం చేశారు.

ఢిల్లీలో జరుగుతున్న హింసాకాండకు తుకుడే తుకుడే గ్యాంగే కారణమంటూ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు అమిత్ షా. అలాంటి వారిని శిక్షించాలని ఓ ర్యాలీలో మాట్లాడుతూ అన్నారు.

English summary
The Home Ministry on Tuesday said it has no information on any group called the ‘Tukde Tukde Gang’. Replying to a written question in Lok Sabha, Minister of State for Home G Kishan Reddy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X