వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు చెయ్యలేం అంటున్న మహిళలు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: రాత్రి పూట ఉద్యోగాలు చెయ్యడానికి స్త్రీలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పలు కంపెనీల నిర్వహకులు వేరే మార్గాలు చూసుకుంటున్నారు. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 48 శాతం మంది మహిళలు నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు చెయ్యలేమని తేల్చి చెబుతున్నారు. 20 నుండి 50 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళ ఉద్యోగుల మనోభావాలను తెలుసుకోవడానికి అసోచామ్ అనే సంస్థ సర్వే చేసింది. మొత్తం 1,600 మంది మహిళ ఉద్యోగులపై సర్వే నిర్వహించింది. వీరిలో 48 శాతం మంది నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు చెయ్యలేమని అంటున్నారని ఆ సర్వే నివేదిక వెళ్లడించింది.

గత రెండు సంవత్సరాలతో పోల్చుకుంటే 27 శాతం మంది మహిళ ఉద్యోగులు నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు నిలిపివేశారని వెళ్లడించారు. స్త్రీలకు అభద్రతాభావం ఎక్కువ కావడం వలనే వారు రాత్రి పూట ఉద్యోగాలు చెయ్యడానికి నిరాకరిస్తున్నారని వెలుగు చూసింది. ముఖ్యంగా పట్టణాలలో, పట్టణ శివార్లలో ఉన్న కంపెనీలలో మహిళలు నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు చెయ్యడానికి నిరాకరిస్తున్నారు. రాత్రి పూట పని చెయ్యలేమని, ఉద్యోగానికి వెళ్లి రావడానికి ప్రయాణించడానికి ఎక్కువ సమయం పడుతున్నదని మహిళ ఉద్యోగులు అంటున్నారు. మహిళలు ఎందుకు రాత్రి ఉద్యోగాలు చెయ్యడానికి వెనకడుగు వేస్తున్నారు అంటే వారు చెబుతున్న ఈ కారణాలే అందుకు నిదర్శనం.

no interest night shift jobs in India

మహిళలకు కోన్ని కంపెనీలు రాత్రిపూట భద్రత కల్పించడంలో విఫలం అవుతున్నారు. ఈ విదంగా రాత్రి పూట ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య తగ్గిపోయింది. మహిళ ఉద్యోగులు కంపెనీ దగ్గరకు రావడానికి, ఉద్యోగం పూర్తి అయిన తరువాత వారు ఇంటికి వెళ్లడానికి కంపెనీల నిర్వహకులు వాహనాలు ఎర్పాటు చేస్తున్నారు. అయినా మహిళలు తమకు సరైన భద్రత లేదని 50 శాంతం మంది మహిళ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మహిళలు ఉద్యోగాలు చేసే చోట ఎక్కువ మంది మహిళలు పని చేసే విదంగా కంపెనీల నిర్వహకులు చర్యలు తీసుకొవాలి. అప్పుడే తోడుగా సాటి ఉద్యోగులు ఉంటారని, అప్పుడు కోంచెం ధైర్యంగా ఉండవచ్చని మహిళ ఉద్యోగులు అంటున్నారు.

ఉత్తరాధి రాష్ట్రాలతో పోల్చుకుంటే దక్షిణాధి రాష్ట్రాలలో మహిళ ఉద్యోగులకు భద్రత ఉంది. బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్ వంటి నగరాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో రాత్రిపూట ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు భద్రత కల్పిస్తున్నారని సర్వేలో వెళ్లడి అయ్యింది. వారు ఇంటి నుండి ఉద్యోగానికి వచ్చి వెళ్లే సమయంలో కంపెనీ వాహనంలో సెక్యూరిటిగార్డు ( వారి దగ్గర లైసెన్స్ కలిగిన తుపాకి ఉంటుంది) ఉంటాడు. ఢిల్లీలో రాత్రి పూట ఉద్యోగాలు చెయ్యడానికి అధికశాతం మంది మహిళ ఉద్యోగులు వెనకడుగు వేస్తున్నారు. తరువాత స్థానంలో బెంగళూరు ఉంది. బెంగళూరు నగరంలో రాత్రిపూట ఉద్యోగాలు చెయ్యడానిక మహిళ ఉద్యోగులు ముందుకు రావడం లేదు. తరువాత స్థానాలలో ముంబాయి, అహ్మదాబాద్, లక్నో నగరాలు ఉన్నాయి. మహిళలు రాత్రి పూట ఉద్యోగాలు చెయ్యకపోవడానికి చాల కారణాలు ఉన్నాయి.

గతంలో బెంగళూరులోని కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్న ప్రతిభ అనే మహిళను 2005 డిసెంబర్ 12వ తేది రాత్రి ఆమె ఇంటి దగ్గర నుండి ఉద్యోగానికి బయలుదేరారు. ఆ సమయంలో ఇంటి ముందు ఆమె భర్త ఉన్నాడు. కంపెనీ కారు తీసుకు వచ్చిన డ్రైవర్ శివకుమార్ ప్రతిభను పిలుచుకుని ఇంటి దగ్గర నుండి కంపెనీ దగ్గరకు బయలుదేరాడు. ఆ సమయంలో వాహనంలో ప్రతిభ ఒక్కరే ఉన్నారు. అయితే మార్గం మద్యలో అతను ప్రతిభను నిర్జన ప్రదేశంలోకి తీసుకు వెళ్లి కారులోనే అత్యాచారం చేశాడు. తరువాత కారులో నుండి బయటకు లాగి అత్యాచారం చేసి హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బెంగళూరులోని ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానం 2010 అక్టోబర్7వ తేదిన నిందితుడు శివకుమార్ కు యావజ్జీవ కారాగార శిక్ష విదించింది. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా చాల చోట్ల జరగడంతో మహిళలు భయపడుతున్నారు.

English summary
Women in India are not showing interest to do night shifts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X