వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ప్రమాణ స్వీకారం... పాకిస్థాన్‌కు నో ఇన్విటేషన్..! ప్రధాని నిర్ణయం

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్రమోడీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి పోరుగుదేశాధినేతలను సైతం ఆహ్వానిస్తున్నాడు. ఇప్పటికే ప్రపంచదేశాల అధినేతలను సైతం మోడీ అహ్వానించనున్నారు. ముఖ్యంగా దక్షిణాసియా దేశాల కూటమైన బీమ్‌స్టెక్ దేశాల సభ్యులను మోడీ ప్రమాణాస్వికారానికి ఆహ్వనించనున్నట్టు పార్టీ నేతలు తెలిపారు.అయితే మరో పోరుగు దేశమైన పాకిస్థాన్‌కు మాత్రం మోడీ ప్రమాణాస్వీకారోత్సవానికి అహ్వనం అందించలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

మోడీ దౌత్య సంబంధాలు

మోడీ దౌత్య సంబంధాలు

మోడీ మొదటి సారి ప్రధాన మంత్రి అయిన తర్వాత విదేశాంగా విధానంపై దృష్టి సారించారు. ఈనేపథ్యంలోనే సుమారు 40 దేశాల్లో ఆయన పర్యటనలు కొనసాగాయి. ఇక రెండవ సారీ కూడ అధికారం చేపట్టడడంతో ఆయా దేశాలతో కూడ దౌత్యపరమైన సంబంధాలను పెంపోందించుకునేందుకు మోడీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగాన ఆయన ప్రమాణ స్వికారోత్సవానికి ప్రపంచదేశాల నేతలు కూడ హజరుకానున్నారు.

బీమ్‌స్టెక్, అగ్రదేశాల అధినేతల హజరు

బీమ్‌స్టెక్, అగ్రదేశాల అధినేతల హజరు

ఈ నేపథ్యంలోనే ఆసియా దేశాల కూటమితో ఉన్న బీమ్‌స్టెక్ దేశాల నేతలు కూడ హజరు కానున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు తెలిపారు. కాగా దక్షిణాసియా దేశాలతో కూడని భీమ్‌స్టెక్ లో బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్,నేపాల్, భూటాన్ దేశాలు ఉన్నాయి. వీరితోపాటు అగ్రదేశాధినేతలు కూడ హజరు కానున్నారు. వీరిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జపాన్ ప్రధాని షింజో అబే, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహుతో తోపాటు మారిషస్, షాంఘై నేతలు కూడ హజరుకానున్నారు.

2014లో అప్పటి పాక్ ప్రధానికి అహ్వానం

2014లో అప్పటి పాక్ ప్రధానికి అహ్వానం

కాగా మొదటి సారీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో సార్క్ దేశాధినేతలకు మోడీ అహ్వనం అందించారు. దీంతో సార్క్ సభ్య దేశమైన పాకిస్థాన్ కూడ అహ్వానం వెళ్లింది. దీంతో పాక్ ప్రధాని నవాజ్ షరిఫ్ మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హజరయ్యారు. అయితే ఇరు దేశాల మధ్య ముందు మంచి వాతవరణమే ఉన్నప్పటికి ఇటివల జరిగిన పుల్వామా దాడితో రెండు దేశాల మధ్య మరో సారీ విద్వేశాలు రచ్చకెక్కాయి. దీంతో మోడీ పాకిస్థాన్ అహ్వానానికి చెక్ పెట్టాడు.కాగా విదేశీయుల అహ్వానానికి సంబంధించి దేశాధినేతలను ఫైనల్ చేసి సంతకం కూడ చేశారని అధికారులు పేర్కోన్నారు.

 ఫోన్లో మోడీకి అభినందనలు తెలిపిన పాక్ ప్రధాని

ఫోన్లో మోడీకి అభినందనలు తెలిపిన పాక్ ప్రధాని


అయితే పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మాత్రం మోడీకి ఫోన్లో అభినందనలు తెలిపారు. రెండు దేశాల అభివృద్దికి కలిసి పని చేద్దామని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కాగా ఎన్నికల సమయంలో సైతం మరోసారి మోడీ ప్రధానమంత్రిగా గెలుపొందితేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి..మొత్తం మీద మోడీ పాకిస్థాన్‌కు అహ్వానం అందించకపోవడంతో ఆదేశంతో భవిష్యత్ సంబంధాలపై స్పష్టత ఇచ్చినట్లైంది.

English summary
India is redefining its immediate neighbourhood, without Pakistan. For Narendra Modi’s second inauguration on Thursday the governmenthas invited leaders from BIMSTEC countries. but thres is no invation to pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X