• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీబీఐ అంటే సినిమాలాగే ఉండాలె -ఉద్యోగులెవరూ జీన్స్, టీషర్ట్, స్పోర్ట్స్ షూ వేయొద్దు: కొత్త డైరెక్టర్ సుబోధ్ ఆదే

|

నాటి సెవెంటీస్ మొన్నటి స్పెషల్ ఛబ్బీస్ వరకు సినిమాల్లో సీబీఐ అధికారి క్యారెక్టర్ అంటే.. ఫార్మల్ దుస్తుల్లో నీట్ గా టక్ చేసుకుని హుందాగా కనిపిస్తుంటారు. మోస్ట్ పాపులర్ టీవీ షో 'సీబీఐ'లో అధికారులు ఆల్మోస్ట్ సూట్లలోనే కనిపిస్తారు. నిజజీవితంలో మాత్రం సీబీఐ అధికారులు, ఉద్యోగులు చాలా మారిపోయారు. కంఫర్ట్ కోసం రకరకాల దుస్తులు ధరిస్తూ, ఆహార్యం ఇలానే ఉండాలనే గీతను ఎప్పుడో చేరిపేశారు. సీబీఐ కొత్త డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ మళ్లీ ఆ గీతను దిట్టం చేయనున్నారు. సీబీఐలో డ్రెస్ కోడ్ అమలుకు ఆయన కీలక ఆదేశాలిచ్చారు..

రఘురామ ఇష్యూలో ట్విస్ట్: పార్లమెంట్‌కు ఏపీ సీఐడీ ఉదంతం -షాకైన ఎంపీలు -జగన్‌ను హిట్లర్‌తో పోల్చుతూరఘురామ ఇష్యూలో ట్విస్ట్: పార్లమెంట్‌కు ఏపీ సీఐడీ ఉదంతం -షాకైన ఎంపీలు -జగన్‌ను హిట్లర్‌తో పోల్చుతూ

భారత దేశానికి సంబంధించి అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ) నూతన డైరెక్ట‌ర్‌గా ఐపీఎస్ సుబోధ్ కుమార్ జైస్వాల్ బాధ్యతలు చేపట్టి పట్టుమని 10 రోజులైనా తిరక్కముందే, సంస్థాగత ప్రక్షాళకు నడుంబిగించారు. ముందుగా ఉద్యోగుల క్రమశిక్షణపై ఫోకస్ పెట్టారు. సీబీఐలో పనిచేసే ప్రతి ఒక్కరూ విధిగా డ్రెస్ కోడ్ పాటించాలని ఆదేశించారు. ఇక నుంచి సిబ్బంది ఎవరూ జీన్స్, టీష‌ర్ట్స్‌, స్పోర్ట్స్ షూలు వేసుకోకూడ‌ద‌ని, హుందాగా క‌నిపించే ఫార్మ‌ల్ డ్రెస్సులే వేసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు.

 No Jeans, T-shirts, Beard Allowed for CBI Employees, Rules New Director Subodh Kumar Jaiswal

సీబీఐ కొత్త డైరెక్టర్ శుక్రవారం జారీ చేసిన ఆదేశల ప్రకారం.. సీబీఐలో ప‌ని చేసే పురుషులు ష‌ర్ట్స్‌, ఫార్మ‌ల్ ప్యాంట్లు, ఫార్మ‌ల్ షూస్ వేసుకోవాలి. గడ్డం, మీసాలు పెంచడానికి వీల్లేదు. ప్ర‌తి రోజూ నీట్‌గా షేవ్ చేసుకోవాల్సిందే. ఇక మ‌హిళా అధికారులైతే చీర‌లు, సూట్లు, ఫార్మ‌ల్ ష‌ర్ట్స్, ప్యాంట్లు మాత్ర‌మే వేసుకోవాలి. మహిళలకు కూడా ఆఫీస్‌లో జీన్స్‌, టీష‌ర్ట్స్‌, స్పోర్ట్స్ షూస్‌, చెప్పులు, క్యాజువ‌ల్ వేర్ ఏదీ అనుమ‌తించ‌బోమని పేర్కొన్నారు.

వైఎస్సార్ పిల్లలకు ఆ రాత లేదేమో-షర్మిల పేరు లేకుండా తెలంగాణలో కొత్త పార్టీ- YSRTPపై ఈసీ కీలక ప్రకటనవైఎస్సార్ పిల్లలకు ఆ రాత లేదేమో-షర్మిల పేరు లేకుండా తెలంగాణలో కొత్త పార్టీ- YSRTPపై ఈసీ కీలక ప్రకటన

దేశ‌వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖ‌ల హెడ్స్ కార్యాలాయాల్లోనూ ఈ ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని డైరెక్టర్ సుబోధ్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. నిజానికి సీబీఐ సిబ్బందికి డ్రస్ కోట్ అనేది ఎప్ప‌టి నుంచో అమలులో ఉందని, అయితే, గ‌త కొన్నేళ్లుగా కొంద‌రు క్యాజువ‌ల్స్ వేసుకుంటూ వచ్చారని, ఇన్ని రోజులూ వారిని ఎవ‌రూ ప్ర‌శ్నించ‌కపోవడంతో అదలా కొనసాగిందని, డ్రెస్ కోడ్ విషయంలో కొత్త డైరెక్టర్ స్ట్రిక్ట్ ఆదేశాలు జారీచేయడంతో ఇక సీబీఐ అంటే సినిమాల్లో చూపించినంత ప్రొఫెషనల్ గానే కనిపిస్తారని తెలుస్తోంది. ప్రధాని మోదీ ఎంపికను సీజేఐ రమణ వీటో చేయడంతో, సీబీఐ డైక్టర్ అయిన సుబోధ్ కుమార్ గ‌త వార‌మే సీబీఐ 33వ డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సంగతి తెలిసిందే.

English summary
All officers and staffers of the Central Bureau of Investigation (CBI) have to be formally dressed in the office and no casual wear clothing like jeans and sports shoes will not be tolerated, said the agency’s director Subodh Kumar Jaiswal. According to an order, the dress code for men will be shirts, formal trousers, and formal shoes and they will be required to come to the office clean shaved. the women employees of the CBI have been asked to wear only sarees, suits, formal shirts, and trousers. “No jeans, T-shirts, sports shoes, chappals, and casual attire is allowed in the office,” said the order. The rules will be applied to CBI offices across the country and the heads of branches have been asked to ensure that guidelines are strictly followed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X