వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రీతిజింతా వేధింపుల కేసు: సీసీటీవీల్లో దొరకని ఆధారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతిజింతాకు ప్రముఖ వ్యాపారవేత్త నెస్ వాడియా వేధింపుల కేసులో.. పోలీసులకు వాంఖేడే స్టేడియంలోని సీసీటీవీ కెమెరాల నుండి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. వాంఖేడే స్టేడియంలోని గార్వేర్ పెవిలియన్ వద్ద ఐదు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి.

ఈ సీసీటీవీ కెమెరాల్లో వేధింపులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని సమాచారం. ప్రీతిజింతా, నెస్ వాడియాల మధ్య వాదనలు జరిగినట్లుగా ఆధారాలు కనిపించలేదు.

No leads from CCTV footage in Preity molestation case

వాంఖేడే స్టేడియంలో 172 రొటేటింగ్ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. అందులో ఐదు సీసీటీవీ కెమెరాలు గార్వేర్ పెవిలియన్ వద్ద ఉన్నాయి. అయితే, ఈ సీసీటీవీ ఫుటేజిలలో మాత్రం వాగ్వాదం, వేధింపులకు సంబంధించిన ఆధారాలు లభించలేదు. అయితే అవి రొటేటింగ్ కెమెరాలు కావడం గమనార్హం.

కాగా, మే 30వ తేదీన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో నెస్ వాడియా తనను లైంగికంగా వేధించాడని ప్రీతిజింతాఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె జూన్ 12వ తేదీన ఫిర్యాదు చేసింది. పలువురు సాక్ష్యులను కూడా పేర్కొంది. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.

English summary
The five CCTV cameras at Garware Pavilion in Wankhede stadium where actress Preity Zinta was allegedly molested by industrialist Ness Wadia on May 30 have neither captured any argument nor scuffle inside the premises between the estranged couple, police said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X