వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్డీయోతర పార్టీలకు సోనియా గాంధి లేఖలు రాయలేదు.. అహ్మద్ పటేల్

|
Google Oneindia TeluguNews

ఎన్డీయోతర పార్టీలకు యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధి 23న సమావేశం కావాలని లేఖలు రాసినట్టు వస్తున్న వార్తలను కొట్టిపారేశారు , సోనియా గాంధి రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్. 23న ఫలితాలు వెలువడనుండడంతో యూపీఏతోపాటు ఏన్డీయోతర పార్టీలతో చర్చిందుకు సోనియా గాంధి నేరుగా లేఖలు రాస్తుందని ఈనేఫథ్యంలోనే తెలంగాణలోని టీఆర్ఎస్, ఏపిలోని వైసీపీ తో ఒరిస్సాలోని ముఖ్యమంత్రి పట్నాయక్‌కు కూడ ఈ లేఖలు స్వయంగా రాస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

no letters to non-NDA parties says ahmed patel

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసిఆర్ డీఎంకే అధినేతతో సమావేశం అయిన నేపథ్యంలో ఆయన యూపిఏకు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఈనేపథ్యంలోనే ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ తోకూడ కాంగ్రేస్ పార్టీ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ బీజేడీ అధినేత ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్‌తో 23న జరిగే సమావేశానికి రావాలని ఆహ్వానించినట్టు బీజేడీ పార్టీ నాయకులు చెప్పినట్టు వార్తలు వెలువడ్డాయి.

కాగా 2014 లో బీజేడీకి 20 సీట్లు టీఆర్ఎస్‌ 11 వైఎస్ఆర్సీపీ 8 సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే .మొత్తం కలిపితే 39 సీట్లు ఉన్న నేపథ్యంలో ఈసారి వాటి సంఖ్య పెరిగే అవకాశం కూడ కనిపిస్థుండడంతో అటు,యూపిఏ,ఇటు ఎన్డీఏ పక్షాలు దక్షిణాదీ పార్టీలపై ఎక్కువగా ద‌ృష్టిపెట్టాయి. ఇందులోబాగంగానే ఒడిశ తుఫాను నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఒడిశ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో మంచి సంబంధాలను కనబర్చారు. మరి ఫలితాల రోజున ఎన్డీఏయోతర పార్టీలు ఏ వైపు మొగ్గుచూపుతాయో వేచి చూడాలి.

English summary
letters had not been written to a number of parties - non-NDA parties - including the BJD, YSRCP, TDP and TRS inviting them for a meeting on result day says ahmad patel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X