• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డబ్బుతో అసద్‌ని కొనే మనిషి ఇంకా పుట్టలేదు .. సీఎం మమతాబెనర్జీ వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ ఘాటు రిప్లై

|

ముస్లిం ఓట్లను విభజించడానికి హైదరాబాద్ నుండి ఒక పార్టీని తీసుకురావడానికి బిజెపి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణలు గుప్పించారు . అయితే మమత బెనర్జీ ఆరోపణలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తిప్పికొట్టారు. తనను కొనుగోలు చేయగల వ్యక్తి ఇంకా పుట్టలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పశ్చిమబెంగాల్లో ముస్లిం ఓటర్లు మమతా బెనర్జీ ఆస్తి కాదని ,మమతా బెనర్జీ అన్నీ తన జాగీర్ గానే భావిస్తోందని లోక్సభ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెద్ద పార్టీలు మమ్మల్ని అంటరానివారన్నారు .. బీహారీలు 5 స్థానాలిచ్చారు : ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపెద్ద పార్టీలు మమ్మల్ని అంటరానివారన్నారు .. బీహారీలు 5 స్థానాలిచ్చారు : ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ

 ప్రపంచంలో అసదుద్దీన్ ని డబ్బుతో కొనగలిగే వ్యక్తి పుట్టలేదన్న ఓవైసీ

ప్రపంచంలో అసదుద్దీన్ ని డబ్బుతో కొనగలిగే వ్యక్తి పుట్టలేదన్న ఓవైసీ

ఇంతవరకు ప్రపంచంలో అసదుద్దీన్ ఒవైసీని డబ్బుతో కొనగలిగే వ్యక్తి పుట్టలేదన్న ఓవైసీ మమతా బెనర్జీ చేసిన ఆరోపణ నిరాధారమైనదని వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ ఆరోపణలన్నీ అవాస్తవాలని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ఎంఐఎం పార్టీని గురించి కాకుండా సొంత పార్టీ నేతలపైన ఆందోళన చెందాలని పేర్కొన్నారు . మమతా బెనర్జీ పార్టీ నాయకులే బీజేపీలో చేరుతున్నారు అంటూ విమర్శించారు. ముందు తన ఇంటిని చక్కదిద్దుకోవాలని అంటూ వ్యాఖ్యానించారు.

సొంత రాష్ట్రంలోనే మమతాబెనర్జీ భయపడుతున్నారని వ్యాఖ్యలు

సొంత రాష్ట్రంలోనే మమతాబెనర్జీ భయపడుతున్నారని వ్యాఖ్యలు

సొంత రాష్ట్రంలోనే మమతాబెనర్జీ భయపడుతున్నారని, బీహార్లో తమకు ఓట్లు వేసిన ఓటర్లను అవమానిస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు కొన్ని పార్టీలు తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవటం కోసం ఎంఐఎం పార్టీని ఓట్ కట్టర్ అంటూ వ్యాఖ్యలు చేశారని, అయితే బీహార్లో అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. మజ్లిస్-ఎ-ఇట్టేహాద్-ఉల్-ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మమతా బెనర్జీ వ్యాఖ్యలకు కౌంటర్ గా ఈ వ్యాఖ్యలు చేశారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల బరిలో ఎంఐఎం పార్టీ .. మమత పార్టీకి షాక్

పశ్చిమ బెంగాల్ ఎన్నికల బరిలో ఎంఐఎం పార్టీ .. మమత పార్టీకి షాక్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఐదు స్థానాల్లో విజయం సాధించడంతో ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంఐఎం పార్టీ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఇదే సమయంలో తమిళనాడులోనూ మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్లనుంది.
వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో అభ్యర్థులను నిలబెట్టి ఎన్నికల బరిలోకి దిగుతామని ఓవైసీ ప్రకటించినప్పుడు, ఈ చర్య మైనారిటీ ఓట్లను విభజించి, తృణమూల్‌ను దెబ్బతీస్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు.

  AP Local Body Elections:ఈసీ వ్యవహారాల్లో మీ జోక్యమేంటి ? అడ్డుపడే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు
   ఇది బీజేపీ డబ్బుతో కొన్న బీ టీమ్ అన్న మమత .. అసద్ ఘాటు రిప్లై

  ఇది బీజేపీ డబ్బుతో కొన్న బీ టీమ్ అన్న మమత .. అసద్ ఘాటు రిప్లై

  ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎంఐఎం పార్టీ పై విరుచుకుపడుతున్నారు. కేవలం అధికార పార్టీని దెబ్బతీయడానికి బీజేపీ బీ టీమ్ ను ప్రయోగిస్తుంది అంటూ, డబ్బులతో ఎంఐఎం పార్టీ ని కొనుగోలు చేసి పశ్చిమ బెంగాల్లో ఓటు బ్యాంకు చీల్చే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. మమత వ్యాఖ్యలకు అసద్ ఘాటుగా రిప్లై ఇచ్చారు . వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో 294 మంది సభ్యుల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయం వేడెక్కింది.

  English summary
  "Never was a man born who can buy Asaduddin Owaisi with money," the AIMIM chief said today, hitting back at Mamata Banerjee's comments on MIM , says that BJP is "spending crores of rupees to bring in a party from Hyderabad to divide Muslim votes".
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X