వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్‌కు మోడి మరోషాక్.. ఇరు దేశాల మధ్య ఎలాంటీ సమావేశాలు లేవని ప్రకటన

|
Google Oneindia TeluguNews

పాకిస్థాన్‌కు ప్రధాని మోడీ మరో షాక్ ఇచ్చారు. ఇప్పటికే ప్రధాన మంత్రి పదవి స్వీకారోత్సవానికి పాకిస్థాన్‌కు ఆహ్వానం పంపని ప్రధాని మోడీ మరోసారి ఆదేశంతో ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా పాకిస్థాన్‌తో ఎలాంటీ సమావేశాలు లేవని ప్రకటించారు.కాగా జూన్ ,13,14 తేదీల్లో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో ,భారత ప్రధాని నరేంద్రమోడీ మధ్య కిర్గిస్థాన్ రాజధాని బిష్‌కేక్‌లో సమావేశం అవుతారని వార్తలు వెలువడ్డాయి. అయితే బిష్‌కేష్‌లో అలాంటీ సమావేశాలు ఏవీ లేవని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ స్సష్టం చేశారు.

కాగా 2001లో ఆసీయా, యూరప్ దేశల మధ్య రాజకీయ, ఆర్ధిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్[ ఎస్‌సీఓ] ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంస్థలో చైనా, కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, రష్యా, ఉజ్బెకిస్థాన్‌ దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కాగా 2017లో భారత్‌ ఎస్‌సీఓలో శాశ్వత సభ్య దేశంగా చేరింది. ఇక వీటికి సంబంధించి జూన్ 13, 14 తేదీల్లో కిర్గిస్థాన్‌ రాజధాని బిష్‌కెక్‌లో ఆదేశ అధ్యక్షుడు సూరోన్‌ బే జీన్‌బెకోవ్‌ అధ్యక్షతన ఎస్‌సీఓ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల నేపథ్యంలోనే పాకిస్థాన్ ప్రధాని, భారత ప్రధానిల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరగనున్నట్టు వార్తులు వెలువడ్డాయి.

No Meeting Between PM Modi, Imran Khan At Regional SCO Summit In Bishkek

కాగా పుల్వామా దాడి తర్వతా భారత్ పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.. దీంతో పాకిస్థాన్‌ను ఒంటరి చేసేందుకు ప్రధాని మోడీ అనేక చర్యలు తీసుకుంటున్నాడు. మరోవైపు పీవోకేలో సైతం ఉగ్రవాదులు ఏరిపారేస్తున్నారు. ఈనేపథ్యంలో అయిుదు నెలల్లో వందమంది తీవ్రవాదులను ఏరివేసినట్టు భద్రతాదళాలు ప్రకటించాయి.

English summary
No meeting is scheduled between Prime Minister Narendra Modi and Pakistan's Imran Khan on the sidelines of the Shanghai Cooperation Organisation or SCO summit in Kyrgyzstan's capital Bishkek, the Foreign Ministry clarified today. PM Modi will attend the SCO summit on June 13-14
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X