• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేరళ కొత్త కేబినెట్‌లో శైలజ టీచర్‌కు దక్కని చోటు-ఫ్యూచర్ సీఎం అంటున్న వేళ-విజయన్ అనూహ్య నిర్ణయం

|

కేరళ కొత్త కేబినెట్ కూర్పు విషయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో నిఫా వైరస్ సమయంలోనూ,కరోనా మొదటి వేవ్ సమయంలోనూ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేసిన కెకె శైలజకు ఈసారి కేబినెట్‌లో బెర్త్ లేదని సమాచారం. భవిష్యత్ ముఖ్యమంత్రిగా కేరళ ప్రజలు ఆమెను కీర్తిస్తున్న వేళ ఈ అనూహ్య నిర్ణయం అందరినీ విస్మయపరుస్తోంది. అయితే శైలజ ఒక్కరే కాదు,గతంలో మంత్రులుగా పనిచేసినవాళ్లెవరికీ కొత్త కేబినెట్‌లో చోటు లేదని తెలుస్తోంది.

ఆల్ టైమ్ రికార్డ్... కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ శైలజా టీచర్‌దే...ఆల్ టైమ్ రికార్డ్... కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ శైలజా టీచర్‌దే...

ఎందుకీ నిర్ణయం...

ఎందుకీ నిర్ణయం...

కేరళలో గౌరీ అమ్మ,సుశీలా గోపాలన్ తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న మహిళా నేత శైలజనే కావడం విశేషం. శైలజ టీచర్‌గా పాపులర్ అయిన ఆమె.. నిఫా వైరస్ కట్టడిలోనూ,కరోనా కట్టడిలోనూ అత్యంత ప్రభావవంతంగా పనిచేశారు. ఆమె చేపట్టిన చర్యలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. అంతర్జాతీయ సంస్థలు సైతం ఆమె పనితీరును అభినందించాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఎవరూ సాధించని స్థాయిలో 60వేల ఓట్ల మెజారిటీతో ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు. అలాంటి శైలజకు మంత్రివర్గంలో చోటు ఇవ్వట్లేదన్న ప్రచారం చాలామందిని విస్మయానికి గురిచేస్తోంది. అయితే ఆమెకు పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

మే 20న విజయన్ ప్రమాణ స్వీకారం

మే 20న విజయన్ ప్రమాణ స్వీకారం

ఇక వరుసగా రెండోసారి కేరళ ముఖ్యమంత్రిగా విజయన్ మే 20న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే విజయన్‌ను మరోసారి శాసనసభా నాయకుడిగా ఎల్‌డీఎఫ్ ఎన్నుకుంది. విజయన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కేవలం 500 మందితో నిరాడంబరంగా నిర్వహించనున్నారు. 50వేల సీట్ల సామర్థ్యం ఉన్న తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో మధ్యాహ్నం 3.30గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.

కొత్త కేబినెట్‌లో ఎవరికి చోటు..?

కొత్త కేబినెట్‌లో ఎవరికి చోటు..?

అదే రోజు కొత్త కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్తగా ఏర్పడే కేబినెట్‌లో మహమ్మద్ రియాస్,వీనా జార్జి,కెఎన్ బాలగోపాల్,వీఎన్ వాసవన్,సాజి చెరియాన్,పీ రాజీవ్,ఎంబీ రాజేశ్,కె రాధాకృష్ణన్,పి నందకుమార్,ఎంవీ గోవిందన్‌లకు చోటు దక్కవచ్చునని ప్రచారం జరుగుతోంది. కొత్తగా కొలువుదీరే అసెంబ్లీలో స్పీకర్‌గా సీపీఎం నేత,డిప్యూటీ స్పీకర్‌గా సీపీఐ నేతను ఎన్నుకుంటారని తెలుస్తోంది. కాగా,నాలుగు దశాబ్దాల చరిత్రను తిరగరాస్తూ విజయన్ నేత్రుత్వంలోని ఎల్‌డీఎఫ్ కేరళలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 140 అసెంబ్లీ స్థానాలకు గాను 99 అసెంబ్లీ స్థానాల్లో ఎల్‌డీఎఫ్ కూటమి విజయం సాధించింది.

English summary
The new Pinarayi Vijayan-led Left Democratic Front (LDF) government in Kerala will not retain any ministers from the previous government, said sourced.KK Shailaja, who was lauded for her exemplary work as health minister during the first wave is unlikely to get a cabinet berth in the new government, they said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X