వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'1990నుంచి భర్తతో శశికళకు సంబంధాల్లేవ్!', దీపకు మొదలైన వేధింపులు..

1990 తర్వాత మళ్లీ ఇప్పటివరకు శశికళ భర్త దినకరన్ పోయెస్ గార్డెన్ లోని జయలలిత నివాసంలోకి అడుగుపెట్టడం లేదని దినకరన్ వ్యాఖ్యానించారు. అప్పటినుంచి శశికళకు నటరాజన్ కు మధ్య సంబంధాలు లేవని సంచలన వ్యాఖ్య చేశా

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆరోపణలు తిప్పికొట్టడానికే చేశారో.. లేక వాస్తవాలే మాట్లాడారో తెలియదు గానీ మొత్తానికి అన్నాడీఎంకె డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవి దినకరన్ పెద్ద బాంబే పేల్చారు. అసలు శశికళకు, ఆమె భర్త నటరాజన్ కు 1990నుంచి అసలు సంబంధాలు లేవని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అన్నాడీఎంకెలో తన అనుయాయి పళనిస్వామితో చక్రం తిప్పిన శశికళపై అటు ప్రజల నుంచి, ఇటు పన్నీర్ సెల్వం, దీప శిబిరం వైపు నుంచి కూడా తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పార్టీతో పాటు ప్రభుత్వం కూడా శశికళ బంధు వర్గమైన మన్నార్ గుడి మాఫియా చేతుల్లోకి వెళ్తోందని వారు ఆరోపిస్తూ వస్తున్నారు.

<strong>కొత్త పార్టీని ప్రకటించిన దీపా , 'ఎంజీఆర్ అమ్మ దీప పేరవై' శశికళకు చెక్ పెట్టేనా?</strong>కొత్త పార్టీని ప్రకటించిన దీపా , 'ఎంజీఆర్ అమ్మ దీప పేరవై' శశికళకు చెక్ పెట్టేనా?

ఆస్తుల మావేనన్న దీప:

ఆస్తుల మావేనన్న దీప:

ఇదే నేపథ్యంలో జయలలిత ఇల్లు సైతం మన్నార్ గుడి మాఫియాకు చెందదని, జయలలితకు బంధువులం తామేనని ఆమె మేనకోడలు దీప జయకుమార్ ఇదివరకే స్పష్టం చేశారు. ఈ క్రమంలో అన్నాడీఎంకే పార్టీ శశికళ కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్లిపోతోందన్న ఆరోపణలపై అన్నాడీఎంకె డిప్యూటీ జనరల్ సెక్రటరీ పరోక్షంగా స్పందించారు.

మన్నార్ గుడిపై దినకరన్ వివరణ:

మన్నార్ గుడిపై దినకరన్ వివరణ:

1990 తర్వాత మళ్లీ ఇప్పటివరకు శశికళ భర్త దినకరన్ పోయెస్ గార్డెన్ లోని జయలలిత నివాసంలోకి అడుగుపెట్టడం లేదని దినకరన్ వ్యాఖ్యానించారు. అప్పటినుంచి శశికళకు నటరాజన్ కు మధ్య సంబంధాలు లేవని సంచలన వ్యాఖ్య చేశారు. పార్టీలో తమ కుటుంబ సభ్యులెవరికీ స్థానం లేదని... కొత్తగా మరెవరినీ చేర్చుకోబోమని కూడా చెప్పారు.

కాగా, జైలుకు వెళ్లడం ఖాయమైన కొద్ది క్షణాల్లోనే తన బంధువు దినకరన్ ను పార్టీకి డిప్యూటీ జనరల్
గా నియమించి శశికళ బెంగుళూరు జైలుకు వెళ్లారు. అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం ఆమె శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

దీపకు వేధింపులు:

దీపకు వేధింపులు:

తమిళనాడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన జయలలిత మేనకోడలు.. తాను స్థాపించిన ఎంజీఆర్ అమ్మా దీప పేరవై తరుపున ఆర్కే నగర్ నుంచి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. అమ్మ మరణంతో ఖాళీ అయిన ఆ స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో.. అక్కడి నుంచి గెలిచి జయలలితకు తానే అసలైన వారసురాలిని అని ప్రకటించుకోవాలనే యోచనలో ఆమె ఉన్నారు.

ఇంటి వద్దకు గూండాలు:

ఇంటి వద్దకు గూండాలు:

జయలలిత మేనకోడలు దీపకు ఆర్కేనగర్ ప్రజల నుంచి ఆదరణ లభిస్తుండటంతో ఆమెకు గూండాల నుంచి బెదిరింపులు, ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. నిత్యం తన ఇంటి వద్దకు పలువురు గూండాలు వస్తున్నారని, వారు ఎవరి వర్గానికి చెందినవారో కూడా తెలియదని దీప ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్కే నగర్ ప్రజల నుంచి దీపకు మద్దతు పెరుగుతుండటంతోనే ఆమెకు బెదిరింపులు ఎదురువుతున్నట్లుగా పలువురు చెబుతున్నారు. ఎన్నికల్లో ఆమెను అడ్డుకోవడానికి అప్పుడే ప్రయత్నాలు మొదలయ్యాయన్న వాదన వినిపిస్తోంది.

English summary
AIADMK deputy general secretary T T V Dinakaran has ruled out the possibility of reinducting any more of the family members of general secretary V K Sasikala, including her husband M Natarajan and brother V Divakaran into the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X