వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్‌లో మొహర్రం ర్యాలీలు నిషేధం.. మరోసారి ఆంక్షలు విధింపు

|
Google Oneindia TeluguNews

కశ్మీర్‌లో పరిస్థితులు అన్ని సాధరణంగా మారాయని చెబుతున్న కేంద్రం అందుకు అనుగుణంగా మాత్రం వ్వవహరించడం లేదు. కర్ఫ్యూ విధించిన కొద్ది రోజులకే బక్రీద్ రావడంతో నిబంధనలు సడలిస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం కశ్మీర్ ప్రజల సాధరణ జనజీవనానికి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని ప్రకటించారు. మొహర్రాం సంధర్భంగా మరోసారి ఆంక్షలను విధించింది. అయితే పరిస్థితులు చూస్తూంటే కశ్మీర్‌లో సాధరణ జనజీవనానికి ఇంకా సమయం పట్టే అవకాశం కన్పిస్తోంది.

కశ్మీర్‌లో కేంద్రం భావిస్తున్నట్టుగా సాధరణ పరిస్థితులు ఇప్పుడే కొలిక్కి వచ్చే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. లోయలో తాజగా భద్రత పరమైన చర్యలు కొనసాగిస్తున్నట్టు సమాచారం.ఇందులో భాగంగానే నేడు దేశ వ్వాప్తంగా జరుగుతున్న మొహర్రం పండగ ర్యాలీలకు కశ్మీర్ ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. దీంతోపాటు మరోసారి షియాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో రొడ్లన్ని బ్లాక్ చేసింది. ఇక ప్రార్థన మందిరాల్లోనే మొహర్రం వేడుకలకు జరుపుకొవాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూను కూడ విధించింది.

NO Muharram processions in the Valley,

మొహర్రం ఉత్సవాల్లో భాగంగానే ముందస్తుగా ర్యాలీలను నిషేధిస్తూ ప్రకటనను విడుదల చేయడంతో ప్రజలు వీధుల్లోకి వచ్చేందుకు ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. కాగా ఇప్పటికే కొంతమంది షియా నాయకులకు కూడ నిర్భంధంలో భాగంగా ప్రత్యేక అతిధి గృహాలకు తరలించారు.

English summary
The authorities have imposed strict restrictions in parts of Srinagar on Tuesday to hold back Muharram processions in the Valley.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X