వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరోగ్యంగా ఉన్నా: డాక్టర్‌తో మెమెన్, గుడ్‌బై చెప్పాడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

నాగపూర్: ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకుబ్‌ మెమెన్‌ను గురువారం ఉదయం మహారాష్ట్రలోని నాగపూర్‌ జైలులో ఉరిశిక్షను అమలు చేశారు. ఉరిశిక్ష అమలుకు ముందు వైద్యులు మెమెన్‌ను పరీక్షించారు.

ఈ సమయంలో యాకూబ్ మెమెన్ వైద్యులతో... నేను బాగానే ఉన్నానని, తనను పరీక్షించవలసిన అవసరం లేదని చెప్పాడు. నిబంధనల ప్రకారం మెడికల్ ఆఫీసర్ ఉరిశిక్ష అమలు చేయబోయే ముందు పరీక్షలు నిర్వహిస్తారు.

తాను ఆరోగ్యంగా ఉన్నానని మెమెన్ చెప్పినప్పటికీ, నిబంధనల మేరకు మెడికల్ ఆఫీసర్ అతనిని పరీక్షించారు. పరీక్షించినప్పుడు మెమెన్ ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్పారు.

 No need to check me i am fine, Yakub memon told doctor

న్యాయం జరగలేదని భావించిన మెమెన్

తనకు న్యాయం జరగలేదని యాకూబ్ మెమెన్ భావించినట్లుగా తెలుస్తోంది. సుప్రీం కోర్టు తన పైన కఠినంగా వ్యవహరించిందని భావించాడు.

గుడ్ బై

పలువురు జైలు అధికారులకు, పోలీసులకు అతను చివరగా గుడ్ బై చెప్పాడు. అతను బుధవారం రాత్రి వారికి గుడ్ బై చెప్పాడు. సుప్రీం కోర్టులో మెమెన్‌కు అనుకూలంగా తీర్పు ఉంటుందని కుటుంబ సభ్యులు మాత్రమే భావించారట. కానీ యాకూబ్ మెమెన్ మాత్రం అంతా అయిపోయిందని అప్పటికే నిర్ణయించుకున్నాడు.

మృతదేహం అప్పగింతపై వాదనలు

యాకూబ్ మెమెన్ మృతదేహం అప్పగింత పైన అతని కుటుంబ సభ్యులు వాదించారని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం జైలులోనే అతనిని ఖననం చేస్తామని అధికారులు చెప్పారు. అయితే, తమకు మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

తమకు మృతదేహం అప్పగించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని వారు అధికారులకు హామీ ఇచ్చారు. ఈ విషయమై జైలు అధికారులు మహారాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి తీసుకొని, మృతదేహాన్ని అప్పగించేందుకు నిర్ణయించారు.

English summary
I am fine there is no need to examine me, Yakub Memon told the doctors at the Nagpur central jail. As per the procedure, a medical officer is required to examine a death row convict before he is sent to the gallows.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X