వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో సెక్స్ ఎడ్యుకేషన్ .. ఆరెస్సెస్ అనుబంధ సంస్థ సంచలనం ...

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఆరెస్సెస్ అనుబంధ సంస్థ శిక్ష సంస్కృతి ఉత్తాన్ న్యాస్ (ఎస్ఎస్‌యూన్) సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు సెక్స్‌కు సంబంధించిన పాఠ్యాంశాలు బోధించొద్దని సూచించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖకు సూచన చేసింది. దీంతో పిల్లలపై చెడు ప్రభావం పడుతుందే తప్ప .. మంచి జరగదని అభిప్రాయపడింది. ఇప్పటికే రూపొందించిన డ్రాఫ్ట్‌ను కేంద్రం వెనక్కి తీసుకోవాలని కోరింది. ఆరెస్సెస్ అనుబంధ సంస్థ సూచనలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.

 హాట్ కామెంట్స్ ..

హాట్ కామెంట్స్ ..

ఎస్ఎస్‌యూన్ సంస్థను దిననాథ్ బట్రా నెలకొల్పిన సంగతి తెలసిందే. పాఠశాలల్లో సెక్స్‌కు సంబంధించిన అంశాల గురించి వివరించాల్సిన పనిలేదని అభిప్రాయపడ్డారు. దీనిగురించి వివరించాలి అనుకుంటే .. విద్యార్థులు, తల్లిదండ్రులు కౌన్సెలింగ్ ఇస్తే బాగుంటుందని ఉచిత సలహా ఇచ్చారు. జాతీయ విద్యా విధానానికి సంబంధించి డ్రాఫ్ట్ నివేదికను కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ గత మే నెలలో రూపొందించారు. ఇందులో సెక్స్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి వివరించాల్సిన అంశాల గురించి రూపొందించారు. దీనితోపాటు వేధింపులు, మహిళలకు గౌరవం, భద్రత, కుటుంబ నియంత్రణ గురించి కూడా ప్రస్తావించారు.

ఇవీ రూల్స్ ..

ఇవీ రూల్స్ ..

విద్యా విధానానికి సంబంధించి గత ఎన్డీఏ ప్రభుత్వం ఆర్కే కస్తూరిరంగన్ నేతృత్వంలో కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ డ్రాఫ్ట్ పాలసీని రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. అయితే పాఠశాల పాఠ్యాంశాల్లో సెక్స్ అనే పదం ప్రస్తావించడాన్ని ఎస్ఎస్ యూఎన్ సెక్రటరీ అతుల్ కోఠారి తప్పుపడ్డారు. పాఠశాలలో సెక్స్ ఎడ్యుకేషన్ ఎంటీ అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పాలనుకుంటే కొందరు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు. అంతేకాదు విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు.

సైన్స్‌లో ఉంది కదా ..

సైన్స్‌లో ఉంది కదా ..

సైన్స్ సబ్జెక్టులో మానవ శరీరం .. శరీర భాగాలు, నిర్మాణం గురించి విపులంగా వివరించి ఉంటుందని పేర్కొన్నారు. అలా కాదని పాఠశాలలో సెక్స్‌కు సంబంధించిన అంశాలను బోధిస్తే విద్యార్థులపై చెడు ప్రభావం చూపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రస్తుత విద్యా విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సిలబస్, వ్యవస్థ, విధానాలు, పాలసీ అన్నింటినీ సమూలంగా మార్చాలని కోరారు.

English summary
There is no need for sex education in schools or making it part of curriculum under the new education policy proposed by the Centre as it will have negative impact on children, an RSS-affiliated educational organisation said on Tuesday. However, the Shiksha Sanskriti Utthan Nyas (SSUN), founded by educationist Dinanath Batra, suggested that there can be “need based counselling” for students and parents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X