వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాంధీపై వ్యాఖ్యలు: రైటర్ అరుంధతీ రాయ్‌పై నో కేసు

By Pratap
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్‌పై కేసు పెట్టాల్సిన అవసరం లేదని కేరళ గాంధీ స్మారక నిధి సంస్థ తెలిపింది. ఆమెపై కేసు పెట్టాలనే పోలీసుల ఆలోచనను సంస్థ వ్యతిరేకించింది. అయితే, అరుంధతీ రాయ్ తన వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆ సంస్థ సూచించింది.

ప్రజాస్వామ్యంలో అంగీకరించే, వ్యతిరేకించే స్వేచ్ఛ ఉంటుందని కేరళ గాంధీ స్మారక నిధి వర్కింగ్ చైర్మన్ ఎన్ రాధాకృష్ణన్, కార్యదర్శి కెజి జగదీష్ మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అరుంధతీ రాయ్‌కు భావ ప్రకటనా స్వేచ్ఛను ఎవరు కూడా కాదనడానికి లేదని భారత గాంధీ అధ్యయన మండలి చైర్మన్ కూడా అయిన రాధాకృష్ణన్ అన్నారు.

No need to register case against Arundhati Roy: Gandhi forum

కొంత మంది చప్పట్ల కోసం ఏదో ఒకటి మాట్లాడేయడం సరి కాదని ఆయన అన్నారు. గాంధీ విమర్శలకు అతీతుడని తాము అనుకోవడం లేదని కూడా ఆయన అన్నారు. ఆఫ్రికాలో 1894లో ప్రజా జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి గాంధీ కార్యాలపై విమర్శలు, విభిన్నమైన అంచనాలు వస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు.

గాంధీపై విమర్శలు కొత్తవేమీ కావని, అందులో తప్పు కూడా ఏమీ లేదని, అయితే ఆ విమర్శలు చరిత్రను వక్రీకరించే విధంగా ఉండకూడదని ఆయన అన్నారు. గత నెలలో అరుంధతీ రాయ్ కేరళ విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగం క్లిప్పింగుల కోసం పోలీసులు ప్రయత్నించారు. ఆ వ్యాఖ్యల ఆధారంగా అరుంధతీరాయ్‌పై కేసు పెట్టవచ్చా లేదా అనేది పరిశీలించడానికి వాటిని తీసుకున్నారు.

English summary
Joining the issue related to controversial remarks against Mahatma Gandhi by writer Arundhati Roy, Kerala Gandhi Smaraka Nidhi here has disapproved the police move to register a case against her, but has asked the writer to introspect on what she had said. "We do not agree with registering a case against Roy for her remark against Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X