వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీకు బైక్,కారు ఉందా?వాహన చట్టంలో నేటి నుంచే కీలక మార్పులు - ఇక కరోనాకూ హెల్త్ ఇన్సురెన్స్

|
Google Oneindia TeluguNews

ఈ ఆర్థిక సంవత్సరం మూడో మూడో త్రైమాసికం గురువారం(అక్టోబర్ 1) నుంచి ప్రారంభమైన సందర్భంగా పలు రంగాల్లో సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కేంద్రం గతంలో మార్పులు చేసిన చట్టాలకు అనుగుణంగా మోటారు వాహనాలు, ఆహారం, ఆరోగ్య సేవలు, బ్యాంకులో కనీస నిల్వ, డిజిటల్ చెల్లింపులు తదితర రంగాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

ఏడాదికి 10మందిని గర్భవతులు చేస్తూ - ఇప్పటికే 150 మంది పిల్లలు - లాక్‌డౌన్‌లోనూ నేరుగా సెక్స్ఏడాదికి 10మందిని గర్భవతులు చేస్తూ - ఇప్పటికే 150 మంది పిల్లలు - లాక్‌డౌన్‌లోనూ నేరుగా సెక్స్

లైసెన్స్, ఆర్సీ హార్డ్ కాపీలు అక్కర్లేదు

లైసెన్స్, ఆర్సీ హార్డ్ కాపీలు అక్కర్లేదు

సాధారణంగా మనం ఇంటి నుంచి బైక్ లేదా కారును బయటికి తీస్తున్నామంటే డాక్యుమెంట్స్ కచ్చితంగా క్యారీ చేయాల్సిందే. అయితే ఇప్పటిదాకా ఫిజికల్ డాక్యుమెంట్లు లేదా హార్డ్ కాపీలకు మాత్రమే అంగీకారం ఉండేది. కొత్త టెక్నాలజీ వచ్చాక లైసెన్స్, ఆర్సీ సాఫ్ట్ కాపీల జోరు పెరిగింది. కానీ కొందరు ట్రాఫిక్ పోలీసులు మాత్రం హార్డ్ కాపీలే చూపాలని డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది. ఇది వాహనదారులకు ఇబ్బందిగా మారడంతో కేంద్రం ఇటీవలే మోటార్ వాహనాల చట్టం-1989 నియమ నిబంధనల్లో మార్పులు చేసింది. గురువారం(అక్టోబరు 1) నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం.. ట్రాఫిక్ పోలీసులకు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ డిజిటల్ డాక్యుమెంట్స్ చూపిస్తే సరిపోతుంది. హార్డ్ క్యాపీలను ఇకపై వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అందుకోసం..

‘ఎం-పరివాహన్‌’ యాప్ ఉంటే చాలు

‘ఎం-పరివాహన్‌’ యాప్ ఉంటే చాలు


మోటారు వాహన చట్టం-2019 ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చిన దరిమిలా డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీ, ఇన్సూరెన్స్‌ తదితర పత్రాలను (హార్డ్‌ కాపీలు) ట్రాఫిక్‌ పోలీసులకు చూపించాల్సిన అవసరంలేదు. వాటికి బదులుగా ‘డిజీలాకర్‌', ‘ఎం-పరివాహన్‌' యాప్‌లలో ఆయా పత్రాల సాఫ్ట్‌ కాపీలను ఫోన్లో చూపిస్తే సరిపోతుంది. ‘డిజీలాకర్‌', ‘ఎం-పరివాహన్‌' యాప్‌లను డౌన్ లోడ్ చేసుకుని, అందులో మన లైసెన్స్, వాహనాలకు సంబంధించిన ఆర్సీ, ఇన్సురెన్స్ తదితర కాపీలను అప్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది. పోలీసులు హార్డ్ కాపీల కోసం డిమాండ్ చేయడానికి వీల్లేదు. ఇక..

ప్రధాని మోదీకి అత్యాధునిక విమానం - అమెరికా తయారీ బోయింగ్ బీ777 - ఢిల్లీకి ఎయిర్ ఇండియా వన్ప్రధాని మోదీకి అత్యాధునిక విమానం - అమెరికా తయారీ బోయింగ్ బీ777 - ఢిల్లీకి ఎయిర్ ఇండియా వన్

ఫుడ్, హెల్త్ సెక్టార్లలో ఇలా..

ఫుడ్, హెల్త్ సెక్టార్లలో ఇలా..

వాహన చట్టంతోపాటు ఫుడ్ సేఫ్టీ, హెల్త్ రంగాల్లోనూ అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వాటి ప్రకారం.. దేశంలోని ప్రతి స్వీటు షాపులో విడిగా బాక్సుల్లో విక్రయించే మిఠాయిలపై ఇకపై ‘బెస్ట్ బిఫోర్ యూజ్' తేదీని తప్పనిసరిగా ముద్రించాల్సి ఉంటుంది. వివిధ పదార్థాల తయారీలో ఉపయోగించే ఆవనూనెను ఇతర నూనెలతో కలపడం పూర్తిగా నిషేధం. ఆరోగ్య రంగానికి సంబంధించి.. ఇకపై కరోనా చికిత్సను కూడా ఆరోగ్య బీమా పథకాల్లోకి ఇవాళ్టి నుంచి చేరిపోయింది. దీంతో ఆరోగ్య సేవల రేట్లు 5 శాతం - 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నది. మరో రంగమైన..

Recommended Video

#HyderabadRains: Vehicles floating on road due to heavy rains | Oneindia Telugu
బ్యాంకింగ్, టీవీల ధరలు..

బ్యాంకింగ్, టీవీల ధరలు..

ట్రాన్స్ పోర్ట్, ఫుడ్, హెల్త్ సెక్టార్లతోపాటు బ్యాంకింగ్ రంగం, ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపైనా కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో మెట్రో నగరాల్లోని ఎస్బీఐ బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ రూ. 5 వేల నుంచి రూ. 3 వేలకు తగ్గనున్నది. లావాదేవీల భద్రత కోసం.. డిజిటల్‌ చెల్లింపులపై వినియోగదారులు స్వచ్ఛందంగా పరిమితులు విధించుకోవచ్చు. ఉజ్వల యోజన పథకం కింద తీసుకునే గ్యాస్‌ సిలెండర్‌ కనెక్షన్‌ ఉచితంగా ఇవ్వబడదు. దిగుమతి సుంకం పెరిగిన నేపథ్యంలో టీవీల రేట్లు పెరుగనున్నాయి.

English summary
You will no longer need to carry the physical copy of your driving licence, registration certificate, permits, PUC and insurance documents of your vehicle, if you have the digital copies in the MParivahan or digilocker app on your smartphone. With the start of the third quarter from today as part of this financial year, the latest regulations will come into force in many sectors. Some changes are taking place, especially in the areas of motor vehicles, food, health services, minimum deposit in the bank, digital payments and so on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X