వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్‌ ప్రజల భయాందోళన.. పెట్రోల్‌బంకులు, ఏటీఏం సెంటర్ల వద్ద జనం క్యూ, భయపడొద్దంటున్న గవర్నర్

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్ : కశ్మీర్‌లో అప్రకటిత కర్ఫ్యూ నెలకొంది. అమర్‌నాథ్ యాత్రికులకు తిరిగి వెళ్లిపోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో పరిస్థితి మారిపోయింది. మరోవైపు కశ్మీర్‌లో అదనపు బలగాల మొహరింపుతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. దీంతో కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పందించారు. కశ్మీర్‌లో పరిస్థితి అదుపులో ఉందని, రూమర్లను నమ్మొద్దని కోరారు. రాజకీయనేతలు శాంతిగా ఉండాలని .. అసత్య ప్రచారాలను విశ్వసించొద్దని సూచించారు.

రూమర్లను నమ్మొద్దు..

రూమర్లను నమ్మొద్దు..

కశ్మీర్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన వివరించారు. శత్రుదేశం చర్యలకు ధీటుగా మాత్రమే స్పందిస్తున్నామని వెల్లడించారు. దీంతో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు. మరోవైపు కశ్మీర్ కొండల్లో ఉన్న ప్రజలు మాత్రం బిక్కు బిక్కుమంటున్నారు. పరిస్థితి బట్టి కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులు పెట్రోల్‌ను కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు మార్కెట్లలో నిత్యవసరాల సరుకులు ఎక్కువే కొనుగోలు చేస్తున్నారు. ఏటీఎం సెంటర్ల నుంచి నగదు విత్ డ్రా చేస్తున్నారు. దీంతో పెట్రోలు బంకులు, సూపర్ మార్కెట్లు, ఏటీఏం సెంటర్ల వద్ద రద్దీ నెలకొంది. సరుకులు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు బారులుతీరారు.

చార్జీలు ఎత్తివేత

చార్జీలు ఎత్తివేత

దీంతోపాటు విమానయాన సంస్థ క్యాన్సిల్ చార్జీలను కూడా తగ్గించడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా విమానయాన సంస్థలు టికెట్ క్యాన్సిల్ చేస్తే చార్జీ వసూల్ చేస్తాయి. కానీ ఈసారి చార్జీ విధించకపోవడం అనుమానాలు కలుగజేస్తోంది. మరో కశ్మీర్ వ్యాలీలో యాత్రలను కూడా నిషేధించారు. దీంతో కశ్మీర్‌లో ఏం జరుగుతుందోనన్న చర్చ మొదలైంది.

బలగాల మొహరింపు

బలగాల మొహరింపు

గత నెల 25న కేంద్ర హోంశాఖ 100 కంపెనీల సెంట్రల్ ఆర్మ్‌డ్ పారామిలిటరీ బలగాలను కశ్మీర్‌లో మొహరించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు అనుమానాలు మొదలయ్యాయి. అయితే అదేం లేదని .. కశ్మీర్‌లో శాంతి భద్రతల పర్యవేక్షణ కోసమే బలగాలను రంగంలోకి దింపామని వివరించాయి. ఇంత జరుగుతుండటంతో ఏం జరుగుతుందనే సంకేతాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలో గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పందించారు. కశ్మీర్‌లో వచ్చే రూమర్లను నమ్మొద్దని రాజకీయ నేతలను కోరారు. మీరు శాంతిగా ఉండాలని సూచించారు. కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మాజీ సీఎం మొహబూబా ముఫ్తీ, షా ఫసల్, సజ్జద్ లోన్, ఇమ్రాన్ అన్సారీ తదితరులు గవర్నర్‌ను కలిసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

English summary
Jammu and Kashmir Governor Satya Pal Malik on Friday evening asked a delegation of Jammu and Kashmir politicians to "maintain calm and not believe rumours" that are circulating in the Kashmir Valley since an advisory by the government asked Amarnath Yatra pilgrims and tourists to cut short their stay and leave amid intelligence inputs of terror threats. A team of politicians comprising former chief minister Mehbooba Mufti, Shah Faesal, Sajjad Lone and Imran Ansari had approached the governor for a meeting over the "panic" in the Valley.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X