ఆరోగ్య సేతు యాప్ ఉత్తమమైంది..! అసద్ ఆందోళన అనవసరం..! ప్రకాష్ జవదేకర్ వివరణ..!!
ఢిల్లీ/హైదరాబాద్ : రోగ్య సేతు యాప్ పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ ఖండించారు. దీర్ఘకాలిక ప్రయోజనాల
కోసమే ఈ యాప్ ను ప్రవేశపెట్టామని వివరణ ఇచ్చారు. ఆరోగ్య సేతు యాప్ వల్ల వ్యక్తుల వ్యక్విగత సమాచారానికి ఎలాంటి భంగం కలుగుతుందని స్పష్టం చేసారు. వ్యక్తిగత గోప్యతకు ఆరోగ్య సేతు యాప్ విఘాతంగా మారుతుందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తోసిపుచ్చారు.
కార్యాలయాల్లో గాని, ఇంటి పరిసరాల్లో గాని, మరే ఇతర ప్రాంతాల్లో వ్యక్తులకు సమీపంలో ఎవరైనా కరోనా పాజిటివ్ లక్షణాలు కలిగినవారుంటే వారి పట్ల అప్రమత్తం చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది తప్ప ఇది వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయదని ప్రకాశ్ జావదేకర్ చెప్పుకొచ్చారు.

ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఒవైసీ చెప్పినట్టు ఆరోగ్య సేతు యాప్ లో ప్రైవసీకి సంబందించి ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అనవసరం లేదని ప్రకాశ్ జావదేకర్ స్పష్టం చేశారు. ఇది శాస్త్రీయంగా రూపొందించిన అత్యుత్తమ యాప్ అని పేర్కొన్నారు. ఏ వ్యక్తి అయినా దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో పాజిటివ్ గా తేలితేనే సమాచారాన్ని భర్తీ చేయవలసి ఉంటుందని ప్రకాష్ జవదేకర్ చెప్పారు. ఈ యాప్ రానున్న ఒకటి రెండేళ్లు కూడా పని చేస్తుందని, లాక్ డౌన్ ఆంక్షలు ముగిసినా, కరోనా వైరస్ మహమ్మారిపై పూర్తి విజయం సాధించేంత వరకు ఈ యాప్ ప్రజలకు సాహాయపడుతూనే ఉంటుందని ప్రకాశ్ జావదేకర్ చెప్పుకొచ్చారు.
ఆరోగ్య సేతు యాప్ ని భారత దేశంలో సుమారు ఎనిమిది కోట్లమంది ప్రజలు ఉపయోగించుకుంటున్నారని, ప్రతి వ్యక్తీ దీన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ తెలిపారు.