వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎకానమీ క్లాస్ విమానాల్లో నాన్‌వెజ్ కట్, కారణమిదే

ప్రభుత్వరంగ విమానాయానసంస్థ ఎయిరిండియా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకొంది. ఇకనుండి దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్ ప్రయాణీకులకు మాంసాహరాన్ని రద్దుచేసింది.కేవలం శాకాహరాన్ని ఇవ్వాలని నిర్ణయించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానాయానసంస్థ ఎయిరిండియా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకొంది. ఇకనుండి దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్ ప్రయాణీకులకు మాంసాహరాన్ని రద్దుచేసింది.కేవలం శాకాహరాన్ని ఇవ్వాలని నిర్ణయించింది.

కాస్ట్‌కట్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. నష్టాల ఊబిలో ఉన్న ఎయిరిండియాలో ప్రభుత్వ వాటాకు రంగం సిద్దమైంది.మరోవైపు ఇప్పుడు ఎయిరిండియా ఖర్చు తగ్గించుకొనే పనిలో పడింది. ముఖ్యంగా దేవీయ విమానాల్లో మాంసాహర భోజనం ఉండదని ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.

వ్యర్థాలు, ఇతర వ్యయాలు తగ్గించడం క్యాటరింగ్ సేవలను మెరుగుపర్చుకోవడం వంటి చర్యల తప్పనిసరని ఎయిర్‌ఇండియా ఛైర్మెన్ , మేనేజింగ్ డైరెక్టర్ ఆశ్వనీ లోహనీ చెప్పారు.

No non-veg food for Air India's domestic economy class fliers

ఎకానమీ క్లాస్ విమానాల్లో మాత్రం వెజిటేరియన్ ఆహరం మాత్రమే అందించనున్నారు. అయితే అంతర్జాతీయ విమానాల్లో మాత్రం నాన్‌వెజ్ కొనసాగిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ఈ విమానాల్లో నాన్‌వెజ్ పుడ్ ఎక్కువ వ్యర్థమౌతోందని తెలిపింది. ఈ చర్య మూలంగా తమకు ఏడాదికి ఏడాదికి 7.8 కోట్లు ఆదా అవుతోందని ఎయిరిండియా వెల్లడించింది.

Recommended Video

Air India passengers use papers to fan themselves as flight takes off with faulty AC

కాగా, ఎయిరిండియా ఇప్పటికే రూ. 52వేల కోట్ల అప్పుల భారంతో కుదేలైంది. దరిమిలా ఈ నేషనల్ కారియర్‌ను వదిలించుకొనే పనిలో ఉంది ప్రభుత్వం. ఎయిరిండియాలో వాటా అమ్మకానికి కేంద్ర కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం కూడ తెలిపింది. మరోవైపు ఎయిరిండియాలో ప్రభుత్వవాటా కొనుగోలు ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ ఇండిగో సంసిద్దతను వ్యక్తం చేయగా, టాటా గ్రూప్ కూడ ఈ రేసులో ఉన్నట్టు నివేదికలు వెలువడుతున్నాయి.

అయితే ఈ నిర్ణయంపై ఎయిర్ ప్యాసింజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి మహేష్‌రెడ్డి నుండి విమర్శలు గుప్పించారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు పాసింజర్ సర్వే నిర్వహించాలని కోరారు.

English summary
Air India stopped serving non-vegetarian meals to economy-class passengers on all domestic flights from mid-June this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X