వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రామమందిరానికి అడ్డు చెప్పిన వారే ఇప్పుడు భక్తులుగా మారారు'

అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఆపడం ఎవరితరం కాదని బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌ మంగళవారం అన్నారు. గతంలో రామ మందిర నిర్మాణానికి ఎవరైతే అడ్డు చెప్పారో ఇప్పుడు వారే రామ భక్తులుగా మారిపోయారన్నారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఆపడం ఎవరితరం కాదని బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌ మంగళవారం అన్నారు. గతంలో రామ మందిర నిర్మాణానికి ఎవరైతే అడ్డు చెప్పారో ఇప్పుడు వారే రామ భక్తులుగా మారిపోయారన్నారు.

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ముస్లిం కమ్యూనిటీ సైతం అండగా నిలిచిందని తెలిపారు. ఆయన బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణ నిమిత్తం లక్నో వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

No one can stop construction of Ram temple: Sakshi Maharaj

బాబ్రీ మసీదు అని చెప్పే ప్రాంతంలో ముందు నుంచి మసీదు లేద‌ని, ఆ ప్రదేశం రామ జన్మభూమి మాత్ర‌మేన‌ని ఆయ‌న అన్నారు. విదేశీయుడైన బాబర్‌ పేరుతో అక్క‌డ‌ ఏదో కడితే, దానినే బాబ్రీ మసీదుగాసంభోదిస్తున్నార‌న్నారు. ఆ మసీదును కూల్చివేయడం తమకు గర్వకారణమని కూడా ఆయన వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు బిజెపి నేతలు అద్వానీ, కేంద్ర మంత్రి ఉమాభారతి, మురళీ మనోహర్‌ జోషి లక్నో న్యాయస్థానానికి వచ్చిన విషయం తెలిసిందే.

English summary
BJP MP Sakshi Maharaj today said "no power on earth" could stop the construction of a Ram temple in Ayodhya. His statements came ahead of proceedings in the 1992 Babri Masjid demolition case here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X