వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అటకెక్కిన హోంగార్డ్స్ తోలగింపు.. మంత్రి హామీ

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీపావలి పండగ ముందు ఇరవై అయిదు వేల హోంగార్డులను ఉద్యోగాల నుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. దీంతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో సంబంధిత మంత్రి స్పందించారు. హోంగార్డులను ఎవ్వరిని తొలగించడం లేదని స్పష్టం చేశారు. ఒక్క ఉద్యోగిని కూడ తొలగించినట్టు అధికారిక ఉత్వర్వులు ఏవీ రాలేదని చెప్పారు. ఉద్యోగాలను తొలగించమని సంబంధిత హోంగార్డ్స్ శాఖ మంత్రి చేతన్ హామీ ఇచ్చారు.సీఎం కలిసి చర్చిస్తానని అన్నారు.

ఏ ఒక్కరిని తొలగించమని స్పష్టం చేసిన మంత్రి

ఏ ఒక్కరిని తొలగించమని స్పష్టం చేసిన మంత్రి

బడ్జెట్ సంబధిత అంశాలను దృష్టిలో పెట్టుకుని హోంగార్డుల పనిదినాలను తగ్గించామని చెప్పిన ఆయన ఏ ఒక్కరిని కూడ విధుల్లోకి తొలగించవద్దని ఉన్నతాధికారులకు సూచించినట్టు చెప్పారు. ఇక ఇదే అంశంపై చర్చించేందుకు సీఎం ఆధిత్యానాథ్‌తో చర్చిస్తానని చెప్పారు. మరోవైపు ప్రభత్వం తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున ఆందోళన నెలకొనే పరిస్థితులు నెలకొన్నాయి. అదికూడ దీపావళి పండగ ముందు ఇలాంటీ నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వ నిర్ణయానికి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. కాగా తోలగిస్తున్న ఉద్యోగులను సంవత్సరం క్రితమే విధుల్లోకి తీసుకోవడం విశేషం.

25000 హోంగార్డులను తొలగిస్తూ నిర్ణయం

25000 హోంగార్డులను తొలగిస్తూ నిర్ణయం

సరైన నిధులు లేవనే కారణంతో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద విధులు నిర్వహించే 25000 మంది తాత్కాలిక హోంగార్డులను తోలంగిస్తూ... నిర్ణయం తీసుకుంది. రానున్న దీపావళీ నుండి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్టు ప్రకటించారు.. మరోవైపు రాష్ట్రంలో పనిచేస్తున్న మరో 99వేల మంది హోంగార్డులకు కూడ నెలలో సగం రోజులే పనిదినాలను కల్పించనున్నట్టు తెలిపారు.

సుప్రిం ఆదేశాలతో భారం

సుప్రిం ఆదేశాలతో భారం

ఇక సుప్రిం కోర్టు ఆదేశాలకు సంబంధించి ఈ నెల 11నే యూపి పోలీసు విభాగం నిర్ణయం తీసుకుంది.. కాగా ప్రస్తుతం హోంగార్డుకు డైలీ అలవెన్స్ క్రింద 500 రూపాయలను ఇస్తుండగా సుప్రిం ఆదేశాలతో 672 రూపాయలు చెల్లించాల్సి ఉంది. దీంతో ప్రభుత్వం హోంగార్డులను పూర్తిగా తొలంగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన హోంగార్డులకు కూడ సగం పనిదినాలనే కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఇస్తున్న 25 పనిదినాలకు గాను 15 రోజులే విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

English summary
no official letter had been received from the Home Department of home guards remove and that no one will be removed from their jobs said up minister chetan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X