వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం మరో షాక్, నేటి నుంచి నోట్ల మార్పిడి లేదు, రూ.500 ఇలా వినియోగించవచ్చు

రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన కేంద్రం మరో షాకిచ్చింది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి నోట్ల మార్పిడి ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. కేవలం బ్యాంకు డిపాజిట్లకు మాత్రమే అనుమతిస్తారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన కేంద్రం మరో షాకిచ్చింది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి నోట్ల మార్పిడి ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. కేవలం బ్యాంకు డిపాజిట్లకు మాత్రమే అనుమతిస్తారు. అర్ధరాత్రి నుంచి నగదు మార్పిడి కౌంటర్లలో మార్పిడికి ఛాన్స్ లేదని ప్రకటించింది.

నోట్ల రద్దుపై జైట్లీకి తెలిస్తే నాకు చెప్పేవారు: నరేష్, మోడీని నవ్వించిన మాయావతినోట్ల రద్దుపై జైట్లీకి తెలిస్తే నాకు చెప్పేవారు: నరేష్, మోడీని నవ్వించిన మాయావతి

రేపటి శుక్రవారం) నుంచి కేవలం డిపాజిట్‌కు మాత్రమే అనుమతిస్తారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేవలం డిపాజిట్ మినహా మార్పిడికి ఛాన్స్ లేదు.

బిగ్ బజార్‌లో డ్రా: నోట్ల రద్దుపై కేంద్రం మరో ఊరట, స్విస్ అకౌంట్లపై మరో అడుగుబిగ్ బజార్‌లో డ్రా: నోట్ల రద్దుపై కేంద్రం మరో ఊరట, స్విస్ అకౌంట్లపై మరో అడుగు

demonetisation

- విద్యుత్ బిల్లు, నీటి బిల్లులు సహా పలు వినియోగ ఛార్జీలకు పాత రూ.500 నోట్లతో చెల్లించుకొనే గడువు నేటితో ముగిసింది. అయితే, ఆ గడువును అంటే పాత రూ.500 నోట్లతో డిసెంబర్‌ 15 వరకు చెల్లించుకొనే వెసులుబాటును కేంద్రం కల్పించింది. పాత రూ.1000 నోట్లను మాత్రం తీసుకోరు.

- విదేశీయులకు వారానికి రూ.5వేల కరెన్సీని మార్చుకునే అవకాశం కల్పించారు.

- పాత రూ.500 నోటుతో అంతే మొత్తం ప్రీపెయిడ్ మొబైల్ టాపప్‌కు అవకాశం కల్పించారు.

- సహకార రంగం సూపర్ బజార్లలో పాత నోట్లతో కొనుగోళ్లను రూ.5వేల వరకు పరిమితం చేశారు.

- వాటర్, విద్యుత్ బిల్లుల పాత బకాయిలు, ప్రస్తుత బిల్లులను చెల్లించవచ్చు. ఆస్తి పన్ను చెల్లింపుకు వర్తించదు. కానీ ఇది కేవలం వ్యక్తులకు, గృహాలకు మాత్రమే వర్తిస్తుంది.

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాల కేంద్రాల్లో రూ.500 తీసుకుంటారు.

- జాతీయ రహదారుల పైన విధించే టోల్ రుసుం గడువును డిసెంబర్ 2వ తేదీ వరకు పొడిగించారు. అదే సమయంలో డిసెంబర్ 3వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు పాత రూ.500 నోట్లతో ఆ రుసుంను చెల్లించుకోవచ్చు. డిసెంబర్ 2 అర్ధరాత్రి వరకు టోల్ వసూలు లేదు.

- సెంట్రల్, రాష్ట్ర ప్రభుత్వ, మున్సిపల్, లోకల్ బాడీ స్కూళ్లలో ఓ విద్యార్థికి రూ.2000 వరకు చెల్లించేందుకు రూ.500 నోట్లను వినియోగించవచ్చు.

- కేంద్ర, స్టేట్ కళాశాలల్లో ఫీజులు కట్టేందుకు రూ.500 వినియోగించవచ్చు.

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆద్వర్యాలలో నడిచే పాల కేంద్రాల వద్ద రూ.500 ఇవ్వొచ్చు.

- ప్రభుత్వ ఆసుపత్రిలు, మెడికల్ ట్రీట్మెంట్ కోసం రూ.500 వినియోగించవచ్చు.

- రైల్వే టిక్కెట్ కౌంటర్లు, బస్సు టిక్కెట్ కౌంటర్లలో రూ.500 నోటు ఇవ్వవచ్చు. ఎయిర్ లైన్ టిక్కెట్ల కోసం వినియోగించవచ్చు.

- ఎల్పీజీ గ్యాస్ కోసం రూ.500 నోటు వినియోగించవచ్చు.

- కోర్టు ఫీజులు చెల్లించవచ్చు.

60 శాతం పన్నుతో...

ఇదిలా ఉండగా, నల్ల దొరలకు కేంద్రం మరో అవకాశం ఇవ్వనుందా అంటే అవుననే అంటున్నారు. బ్యాంకు అకౌంట్లలో జమ అవుతున్న లెక్కల్లో లేని డబ్బు పైన 60 శాతం ఆదాయపు పన్ను విధించాలని కేంద్రం యోచిస్తోంది.

గురువారం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ భేటీలో నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై చర్చించారు. సమాచారం మేరకు లెక్కల్లో లేని డబ్బును డిపాజిట్ చేస్తే దానిపై అరవై శాతం పన్ను విధించడంపై చర్చించారని తెలుస్తోంది.

English summary
The Central Government has decided that there will be no over the counter exchange of old Rs. 500 and Rs 1000 notes after midnight of November 24.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X