స్పష్టత: '2 వేల నోటును రద్దు చేయం, గుజరాత్, బెంగాల్ లోనే నకిలీ నోట్లు'
రెండు వేల రూపాయాల నోటును రద్దు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.
న్యూఢిల్లీ: రెండు వేల రూపాయాల నోటును రద్దు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.
పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత నల్లధనాన్ని అరికట్టేందుకుగాను కేంద్ర ప్రభుత్వం కొత్త కరెన్సీని ప్రవేశపెట్టింది. గత ఏడాది నవంబర్ 8వ, తేదిన కేంద్రం పెద్ద నగదు నోట్లను రద్దు చేసింది.
అయితే పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత కొత్తగా రెండువేలు, ఐదువందల రూపాయాల కరెన్సీని ప్రవేశపెట్టింది. అయితే రెండు వేల రూపాయాల కరెన్సీ నకిలీ నోట్లు మార్కెట్ లోకి వచ్చాయి.దీంతో కొత్త రెండు వేల రూపాయాల నోట్లను కూడ రద్దు చేస్తారనే ప్రచారం సాగింది.
కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కొత్త రెండు వేల రూపాయాల నోట్లను రద్దు చేసే ప్రశ్నేలేదని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు లోక్ సభలో కేంద్ర మంత్రి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

రెండు వేల నోట్లను రద్దు చేయం
నకిలీ నోట్లను ముద్రించారనే కారణాన్ని చూపుతూ రెండువేల నోట్లను రద్దు చేసే ప్రసక్తేలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజుజు చెప్పారు.రెండువేల రూపాయాల నోట్లను రద్దు చేస్తామనే ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.లోక్ సభలో కాంగ్రెస్ సభ్యుడు మధుసూధన్ మిస్త్రీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా చెప్పారు.

నకిలీ కరెన్సీ సీజ్
నకిలీ రెండువేల రూపాయాలను సీజ్ చేసినట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు.గుజరాత్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో నకిలీ కరెన్సీ ఎక్కువగా పట్టుబడినట్టు ఆయన చెప్పారు.నకిలీ కరెన్సీని గుర్తుపట్టేందుకు అనేక మార్గాలున్నాయని మంత్రి చెప్పారు.కొత్త కరెన్సీని కాపీ చేయడం సాద్యం కాదన్నారు మంత్రి.

సెక్యూరిటీ ఫీచర్లే కొత్త కరెన్సీకి రక్షణ
కొత్తగా మార్కెట్లోకి తీసుకువచ్చిన రెండువేలు, ఐదువందల రూపాయాల నోట్లు హై సెక్యూరిటీ ఫీచర్లతో ఉన్నాయని ఆయన చెప్పారు.ఈ కారణంగా వందశాతం నోట్లను కాపీ చేయడం సాధ్యం కాదని మంత్రి చెప్పారు. అయితే కొత్త కరెన్సీ నోట్లను పోలిన నోట్లను తయారు చేస్తున్నప్పటికీ, వందశాతం అదే తరహ నోటును ముద్రించలేరని మంత్రి ప్రకటించారు.

నకిలీ నోట్ల తయారీదారులపై కఠిన చర్యలు
కొత్త కరెన్సీ నోట్లను పోలిన నోట్లను తయారు చేసేవారిని కఠినంగా శిక్షించనున్నట్టుగా కేంద్ర మంత్రి రిజుజు ప్రకటించారు.నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేసే అనుమానం ఉన్నవారిపై నిఘాను ఏర్పాటు చేశామన్నారు మంత్రి.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications