వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కులం, మతం పేరుతో ఓట్లు అడగకూడదు. సుప్రీం కోర్టు

కులం, మతం పేరుతో ఓట్లు అడగకూడదని సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది.పలు ఈ మేరకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :కుల మతాల పేరుతో ఓట్లు అడగరాదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని రాజ్యాంగ దర్మాసనం చారిత్రత్మక తీర్పును వెలువరించింది. దేవుడి, మనిషి వ్యక్తిగత అంశమని కోర్టు అభిప్రాయపడింది.

ఎన్నికలు దేశంలో లౌకిక విధానంలో భాగమని, కుల, మత ప్రాంతాలకు అతీతంగా ఎన్నికలు జరగాలని ఆకాంక్షను వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. దేవుడికి, మనిషికి మద్య సంబంధం వ్యక్తిగతమని తేల్చింది. ఇందులో ఎవరూ కూడ జోక్యం చేసుకోకూదని స్సష్టం చేసింది.

రెండు దశాబ్దాల క్రితం ఇచ్చిన హిందూత్వ తీర్పును పున:సమీక్షించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సవివరమైన తీర్పునిచ్చింది.రాజకీయ ప్రయోజనం కోసం ఎన్నికల్లో లబ్దిపొందేందుకుగాను మతాన్ని, కులాన్ని దుర్వినియోగం చేయడం అవినీతి కిందకే వస్తోందని సుప్రీంకోర్టు ధర్మాసం అభిప్రాయపడింది.ఈ మేరకు ఎన్నికల చట్టంలోని ఓ సెక్షన్ కోర్టు పేర్కోంది.

no politician can seek vote the name of caste , creed or religion :supreme court

1995 లో హిందూత్వ కేసుపై అప్పటి చీఫ్ జస్టిస్ జెఎస్ వర్మ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. హిందూ రాజ్యాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పి శివసేన నేత మనోహర్ జోషి తో పాటు బిజెపి, శివసేనకు చెందిన మరికొందరి ఎన్నిక చెల్లదని బొంబాయి హైకోర్టు 1991 లో తీర్పును వెలువరించింది.అయితే ఈ తీర్పును 1991లో జెఎస్ వర్మ నేతృత్వంలోని బెంచ్ కొట్టివేసింది. హిందూత్వ, హిందూయిజం అన్నది ఉపఖండంలోని ప్రజల జీవన విధానమని, అదొక మన:స్థితి అని మతం కాదని ఆ తీర్పులో సుప్రీంకోర్టు తెలిపింది. హిందూత్వపేరుతో ఓట్లు అడగడం ప్రజా ప్రాతినిథ్య చట్టానికి విరుద్దం కాదని కోర్టు స్పష్టత ఇచ్చింది.

ఈ తీర్పును వెలువడిన ఏడాది తర్వాత ఇటువంటి కేసునే విచారించిన మరోక త్రిసభ్య ధర్మాసనం జస్టిస్ వర్మ తీర్పుతో విబేధించింది. ఈ అంశాన్ని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ పున:సమీక్షించాలని సూచించింది. ఐదుగురు సభ్యుల బెంచ్ కేసును విచారిస్తుండగానే బిజెపి నేత సుందర్ లాల్ పట్వా ఎన్నిక చెల్లదంటూ నారాయణసింగ్ అనే వ్యక్తి 2002 లో కేసు దాఖలు చేశాడు.

ఈ కేసుకూ ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 123 కు భాష్యం చెబుతూ సవివరమైన తీర్పును వెలువరించేందుకు ఈ కేసు మొత్తాన్ని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది.

English summary
no politician can seek vote the name of caste , creed or religion , the judgement of the apex court while hearing several petitions in hindutva case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X