వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోలీ ఆడొచ్చు, ఇబ్బందేమీ లేదు.. గుమికూడొద్దనే మోడీ ట్వీట్‌పై ‘మహా’మంత్రి రాజేశ్ రియాక్షన్..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కల్లోలంతో యావత్ భారత్ ఆందోళనకు గురవుతోంది. ఓ వైపు వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో హోలీ పండగ వస్తోంది. దీంతో రంగులు పుసుకొంటూ.. జనాలు బిజీగా ఉంటారు. జనసమ్మర్థ ప్రాంతాల్లో ప్రజలు ఉండొద్దని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ క్రమంలో ప్రజలు గుమికూడొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో ప్రజలకు సూచించారు. దీనిపై మహారాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే ధీటుగానే స్పందించారు. హోలీ అనేది హిందూ సంప్రదాయానికి ప్రతీక అని.. హోలీ అడుకొవచ్చని పేర్కొన్నారు.

కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి రాజేశ్ స్పష్టతనిచ్చారు. వైరస్ ప్రబలుతోందని ప్రజలు భయాందోళన చెందొద్దని సూచించారు. వైరస్ కోసం ఇప్పటికే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకున్నామని.. వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. ముంబై విమానాశ్రయంలో ఇప్పటికే 65 వేల మంది ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించామని గుర్తుచేశారు. అయితే ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ సరిగా జరగడం లేదనే అంశంపై మంత్రి స్పందించారు. ఈ అంశం తన దృష్టికి వచ్చిందని.. త్వరలోనే విమానాశ్రయాన్ని సందర్శిస్తానని స్పష్టంచేశారు.

No problem in playing Holi, Maharashtra Health Minister on PM advisory..

Recommended Video

Coronavirus (COVID-19) : Sales of Masks, Sanitizers Increased Across India | Oneindia Telugu

కరోనా వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో కొందరు వ్యాపారులు మాస్క్‌లను ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. అయితే ఇప్పటివరకు మహారాష్ట్రలో ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదుకాలేదని చెప్పారు.

English summary
Maharashtra health Minister Rajesh Tope told on Wednesday, One should definitely play Holi. There is no problem in playing Holi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X