• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మీరు రాకపోతే అదే పదివేలు: రక్షణ కల్పించడం మా వల్ల కాదు: శబరిమలపై కేరళ మంత్రి సంచలనం..!

|

తిరువనంతపురం: కేరళలోని పత్తినంథిట్ట జిల్లా దట్టమైన అడవుల్లో వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించడానికి వచ్చే మహిళా భక్తులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. స్వామివారిని దర్శించడానికి వచ్చే అన్ని వయస్సుల మహిళలకు రక్షణ కల్పించబోమని తేల్చి చెప్పింది. మహిళలు శబరిమలను సందర్శించడానికి రాకపోవడమే మేలు అని కేరళ దేవస్వొ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ వెల్లడించారు. శబరిమల ఆలయానికి సాధారణ భద్రతను మాత్రమే కల్పిస్తున్నామని, మహిళలు సందర్శించేటట్టయితే వారికి అదనపు భద్రతను కల్పించాల్సి ఉంటుందని చెప్పారు. ఆ పని తాము చేయలేమని తేల్చి చెప్పారు.

వద్దని చెప్పలేదుగా.. శబరిమల వెళ్తా: తృప్తి దేశాయ్: సన్నిధానంలో మహిళలకు ప్రవేశం మాటేంటీ?

శనివారం తెరచుకోనున్న సన్నిధానం తలుపులు..

శనివారం తెరచుకోనున్న సన్నిధానం తలుపులు..

శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన రివ్యూ పిటీషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును పెండింగ్ లో ఉంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టీ శబరిమల ఆలయంపైనే నిలిచింది. తాను అయ్యప్ప స్వామిని దర్శించుకుంటానని భూమాత బ్రిగేడ్ సంస్థ సామాజిక ఉద్యమకారిణి తృప్తి దేశాయ్ వెల్లడించిన నేపథ్యంలో.. ఇక ఏ స్థాయిలో మహిళలు మణికంఠుడిని దర్శించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల మధ్య శనివారం.. హరిహర పుత్రుడి గుడి తలుపులు తెరచుకోబోతున్నాయి.

సుప్రీం వద్దే తేల్చుకోండి.. ఇక్కడికి రాకండి..

సుప్రీం వద్దే తేల్చుకోండి.. ఇక్కడికి రాకండి..

మహిళలకు ప్రవేశాన్ని కల్పించడంపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పును కూడా వెల్లడించనందున.. గత సీజన్ తరహాలోనే ఈ సారి కూడా పెద్ద సంఖ్యలో మహిళలు శబరిమలకు చేరుకోవడానికి అవకాశం ఉందని కేరళ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో.. కడకంపల్లి సురేంద్రన్.. ఈ ఘాటు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శబరిమలకు వచ్చే మహిళలకు తాము రక్షణ కల్పించలేమనే మాటను తాను పదేపదే చెబుతున్నానని అన్నారు. దీన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అవసరమైతే మహిళలంతా సుప్రీంకోర్టుకే వెళ్లి తేల్చుకోవాలే గానీ, తమ రాష్ట్రానికి రావొద్దని ఆయన చెప్పారు.

శబరిమలలో మహిళల ప్రవేశంపై తీర్పు పెండింగ్..

శబరిమలలో మహిళల ప్రవేశంపై తీర్పు పెండింగ్..

చారిత్రాత్మకమైన, ప్రతిష్ఠాత్మకమైన శబరిమల ఆలయంలో అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశాన్ని కల్పించడానికి ఉద్దేశించిన రివ్యూ పిటీషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం తన తుది తీర్పును పెండింగ్ లో ఉంచింది. దీనిపై మరింత విస్తృత పరిశీలన అవసరమని అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం అభిప్రాయ పడింది. ఈ కేసును ఏడుమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పరిశీలనకు పంపించింది. గురువారం ఉదయం దీనిపై తుది తీర్పు వెలువడాల్సి ఉన్నప్పటికీ.. అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనంలో భేదాభిప్రాయాలు తలెత్తాయి.

తీర్పునకు అనుకూలంగా ముగ్గురు.. ప్రతికూలంగా ఇద్దరు

తీర్పునకు అనుకూలంగా ముగ్గురు.. ప్రతికూలంగా ఇద్దరు

శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించడానికి అనుమతి ఇచ్చే విషయంలో అయిదుంది న్యాయమూర్తులు ఉన్న ధర్మాసనంలో భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మహిళలకు ప్రవేశాన్ని నిషేధించడానికి ముగ్గురు న్యాయమూర్తులు సమర్థించారు. మరో ఇద్దరు దీన్ని తిరస్కరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, ఖన్విల్కర్, ఇందు మల్హోత్రా మహిళల ప్రవేశానికి నిషేధించడానికి అనుకూలంగా ఉండగా.. జస్టిస్ నారీమన్, జస్టిస్ డీవై చంద్రచూడ్ వారికి ప్రవేశం కల్పించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ తీర్పును పెండింగ్ లో ఉంచారు.

English summary
The state’s temple affairs minister Kadakampally Surendran said emphatically that the government will not encourage women to gate crash the temple. “It is proper to maintain the status quo at the temple. The government is all for peace,” Surendran said during a press conference in the state capital of Thiruvananthapuram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more