అది ఫ్యామిలీ హాలీడే కాదు : ఆఫిషీయల్ టూరే, నేవీ మాజీ కమాండర్
న్యూఢిల్లీ : ఎన్నికల వేళ అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్య విమర్శలు హద్దులు దాటుతున్నాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఐఎన్ఎస్ విరాట్ నౌకలో పార్టీ చేసుకొన్నారని ప్రధాని మోదీ ఆరోపించగా .. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఈ వివాదం ఇలా కొనసాగుతోన్న వేళ .. రాజీవ్ పార్టీ కోసం వినియోగించలేదని మాజీ కమాండింగ్ ఆఫీసర్ చెప్పడం కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరింది.
ప్రత్యక్ష సాక్షి ..
రాజీవ్, అతని స్నేహితులు, అత్త, సోనియా తదితరులు ఐఎన్ఎస్ విరాట్‌లో విహరించారని మోదీ ఆరోపించారు. పార్టీల కోసం వినియోగించారని కామెంట్స్ చేశారు దీనిని 1987 నాటి విరాట్ కమాండెంట్ ఆఫీసర్ వైస్ అడ్మిరల్ వినోద్ ఖండించారు. ప్రధాని మోదీ సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఆఫిషీయల్ టూర్
రాజీవ్ లక్ష్వదీవులకు అధికార కార్యక్రమం కోసం వెళ్లారని గుర్తుచేశారు. ద్వీపంలో అక్కడి అధికారులు సమావేశం ఏర్పాటు చేశార తప్ప .. అది ఫ్యామిలీ హాలీడే కాదని స్పష్టంచేశారు. భర్తతోపాటు సోనియా, కుమారుడు రాహుల్, ఇతర అధికారులు కూడా ఉన్నారని .. విధుల్లో నిమగ్నమైన భర్తతో భార్య, పిల్లలు ఉండొద్దా అని ప్రశ్నించారాయన. అయితే అమితాబ్ బచ్చన్ కుటుంబం కూడా ఉందనే వాదను తప్పుపట్టారు. రాహుల్, సోనియా, ఐఏఎస్ అధకారులు తప్ప మరొకరు లేరని కుండబద్దలు కొట్టారు. ఈ రాజకీయాలను నేవి ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించబోదని స్పష్టంచేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!