వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న వారికి నో రీఫండ్ అంటున్న కొన్ని సంస్థలు: ఆల్టర్నేట్ ఏంటంటే

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ నిన్నటితో ముగుస్తుందని ప్రయాణాలు చెయ్యటానికి వెసులుబాటు దొరుకుతుంది అని భావించిన వారికి కేంద్ర సర్కార్ ఝలక్ ఇచ్చింది . మరోసారి లాక్‌డౌన్ పొడిగించడంతో మే 3వ తేదీ వరకు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ప్రయాణాల కోసం టికెట్లు బుక్ చేసుకున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది .

Recommended Video

No Refund to Customers For Cancelled Tickets As Lockdown Extended
ప్రయాణికులకు టికెట్‌ చార్జీలు నో రీఫండ్‌ అంటున్న విమాన సంస్థలు

ప్రయాణికులకు టికెట్‌ చార్జీలు నో రీఫండ్‌ అంటున్న విమాన సంస్థలు

కరోనా నియంత్రణా చర్యల్లో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకోవటంతో మరోమారు విమానయాన , రైలు, బస్సు సర్వీసులు ఎక్కడివక్కడే నిలిచిపోనున్నాయి. కేంద్రం నిర్ణయంతో విమానసర్వీసులు, రైల్ సర్వీసులు, బస్సు సర్వీసులు ఇలా అన్ని రద్దు చేశారు. అయితే, ఇదే సమయంలో ప్రయాణికులకు విమానయాన సంస్థలు షాక్ ఇచ్చారు. సరీసులు రద్దు చేసినా డబ్బు వాపస్ ఇవ్వటానికి నో అంటున్నారు . విమానాలు రద్దయినప్పటికీ ప్రయాణికులకు టికెట్‌ చార్జీలు రీఫండ్‌ చేయరాదని నిర్ణయించి ప్రత్యామ్నాయం సూచించాయి.

మరో తేదీకి టికెట్లను రీషెడ్యూల్‌ చేసుకోవచ్చని ప్రకటన

మరో తేదీకి టికెట్లను రీషెడ్యూల్‌ చేసుకోవచ్చని ప్రకటన

ఇక అదేంటంటే అదనపు రుసుములేమీ లేకుండా ప్రయాణికులు మరో తేదీకి టికెట్లను రీషెడ్యూల్‌ చేసుకోవచ్చని ప్రకటించాయి. లాక్ డౌన్ కాలం ముగిసిన తర్వాత ఈ ఏడాది డిసెంబర్‌ 31 దాకా ప్రయాణికులు ఉచితంగా ఈ డబ్బు మీద తమ ప్రయాణాలను రీషెడ్యూల్‌ చేసుకునే అవకాశం ఉంటుందని విమానయాన సంస్థ 'విస్తార' ప్రతినిధి తెలిపారు. రీబుకింగ్‌ సమయంలో చార్జీలు పెరిగిన పక్షంలో ఆ మేరకు వ్యత్యాసాన్ని ప్రయాణికులు కట్టాల్సి ఉంటుందని కూడా వివరణ ఇచ్చారు. ఇక రీఫండ్ కు ఏ మాత్రం అవకాశం లేదని చెప్తున్నారు.

ఇనియోగాదారులను నష్టపరిచే అంశం సమీక్షించాలన్న సీఏపీఏ

ఇనియోగాదారులను నష్టపరిచే అంశం సమీక్షించాలన్న సీఏపీఏ

ఇక, రీషెడ్యూలింగ్‌ స్కీమ్‌ వెసులుబాటును ఏప్రిల్‌ 30 దాకా ప్రయాణాల బుకింగ్స్‌కు మాత్రమే వర్తింపచేస్తున్నట్లు 'గోఎయిర్'‌ ప్రకటించింది. అయితే, రీ షెడ్యూల్ చేసుకునే వినియోగదారుల మాట ఓకే కానీ ప్రయాణాలు చెయ్యటం అవసరం లేని వారు కూడా రీ షెడ్యూల్ చేసుకోవటం కాస్త ఇబ్బందికరమే . వినియోగదారులను నష్టపరిచే ఈ అంశాన్ని సత్వరం సమీక్షించుకోవాలని "సెంటర్‌ ఫర్‌ ఏషియా పసిఫిక్‌ ఏవియేషన్"‌ (సీఏపీఏ) ప్రకటించింది. ఏది ఏమైనా ఇది లాభమో నష్టమో విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదో ఒకటిలే మొత్తానికి డబ్బు పోకుంటే చాలు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది .

English summary
Aviation, rail and bus services were once again canceled after the central government made a decision to extend the lockdown in Corona control actions. At the same time, however, airlines were giving shock to passengers. The money is refunded if the repairs are canceled. The alternative is to offer travelers the option of refunding the ticket fare even if flights are canceled. They suggested to re schedule the trips .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X