ఆశారాం బాపుకు బెయిల్ నిరాకరణ... మరికొన్ని రోజులు జైల్లోనే..!
న్యూఢిల్లీ: వివాదాస్పద గురువు ఆశారాం బాపు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. తనకు శస్త్రచికిత్స కోసం బెయిల్ ఇవ్వాలని ఆయన పెట్టుకున్న దరఖాస్తుపై విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ని పరీక్షించిన వైద్యబృందం ఆశారాం బాపుకు శస్త్ర చికిత్స అవసరం లేదని మందులతో నయమవుతుందని వైద్యులు మెడికల్ రిపోర్టును సుప్రీం కోర్టుకు సమర్పించారు.
ఈ నేపథ్యంలో ఆసారాం బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించింది.
తన ఆశ్రమానికి వచ్చిన 18ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు ఆశారాం బాపుపై పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులో అరెస్టయిన ఆశారాం బాపు గత కొన్ని నెలలుగా రాజస్ధాన్లోని జోధ్ పూర్ సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు.