వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒమర్ అబ్దుల్లాకు దక్కని ఊరట: జమ్మూకాశ్మీర్ ప్రభుత్వానికి నోటీసులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఒమర్ అబ్దుల్లా నిర్బంధాన్ని సవాల్ చేస్తూ ఆయన సోదరి సారా అబ్దుల్లా దాఖలు చేసిన పటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. అనంతరం జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగానికి వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.

ప్రజా భద్రత చట్టం కింద ఒమర్ అబ్దుల్లా నిర్బంధం సరైనదేనా అనే అంశంలో విచారణను చేపట్టిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వాయిదా వేసింది. కాగా, ఒమర్ అబ్దుల్లాను తక్షణమే కోర్టులో హాజరుపరిచి, ఆయనను విడుదల చేయాలని ఆయన సోదరి సారా అబ్దుల్లా తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు.

No relief for Omar Abdullah; SC seeks reply from J&K govt

ఒమర్ అబ్దుల్లా త్వరలోనే విడుదలవుతారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. సారా తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ స్వేచ్ఛకు సంబంధించినదని తక్షణమే వివాచరణకు చేపట్టాలని కపిల్ సిబల్ చేసిన వినతిని తోసిపుచ్చిన సుప్రీకోర్టు.. విచారణను మార్చి 2కు వాయిదా వేసింది.

న్యాయవ్యవస్థ పట్ల తమకు పూర్తి విశ్వాసం ఉందని, మిగిలిన దేశ ప్రజలందరి మాదిరిగానే కాశ్మీరీలకు కూడా అవే హక్కులుంటాయని తాము నమ్ముతున్నట్లు తెలిపారు. ఆ రోజు కోసం తాము వేచి చూస్తున్నామన్నారు. కాగా, జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం గత ఆగస్టు 5న మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా సహా ఒబర్ అబ్దుల్లాను గృహ నిర్బంధంలో ఉంచారు. ఉగ్రవాదులు సహకరించేవారు, రాళ్ల దాడులకు పాల్పడేవారిపై ప్రయోగించే ప్రజా భద్రత చట్టం కింద వీరిని
నిర్బంధంలో ఉంచింది.

English summary
The Supreme Court on Friday sought reply from the Jammu and Kashmir government and other authorities on Sara Pilot's petition challenging the detention of her brother and former J&K Chief Minister Omar Abdullah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X