వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

16 రాష్ట్ర్రాల్లో ఖాతా తెరవని కాంగ్రెస్ .... !

|
Google Oneindia TeluguNews

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోగ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలాపడింది. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోటీ చేసింది.కొన్ని రాష్ట్ర్రాల్లో ఒంటరిగా పోటీ చేయగా, పలు రాష్ట్ర్ర్రాల్లో పోత్తులు కుదుర్చుకుంది. అయినా మోడీ హావాకు కాంగ్రెస్ పార్టీ కొట్టుపోయింది. ఈనేపథ్యంలోనే అలయెన్స్ పార్టీలతో కలసి వందస్ధానాలు కూడ దాటని పరిస్థితి .ఇక దేశంలోని 29 రాష్ట్ర్రాల్లో పార్టీ పోటిచేయగా 13 రాష్ట్ర్రాలతోపాటు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అసలు ఒక్క సీటు కూడ గెలుపోందలేదు.

no representaion for 16 states to congress

16 రాష్ట్ర్రాలు,కేంద్రప్రాంతాల్లో ఖాతా తెరవని కాంగ్రెస్

కాగా కాంగ్రెస్ పార్టీకి అసలు సీట్ల ప్రాతినిథ్యం లేని రాష్ట్రాలను పరీశీలిస్తే గుజరాత్, రాజస్థాన్, హర్యాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఆరుణాచల్ ప్రదేశ్, ఓడిశా, త్రిపురా, మణిపూర్, మీజోరాం, తోపాటు చండిఘడ్ రాష్ట్రాలలో ఒక్క స్థానం కూడ గెలుచుకోలేదు. ఇక వీటీతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలైన డామన్ డయ్యు, దాద్రనగర్ హవేలీ, అండమాన్ నికోబార్ లలో కూడ కాంగ్రెస్ పార్టీ ఖాతాను తెరవలేక పోయింది.

దేశంలో ప్రభంజనం స‌ృష్టించిన బీజేపీకి సైతం అదే బాట

దేశవ్యాప్తంగా సీట్ల ప్రభంజనంలో దూసుకుపోతుంది బీజేపీ. ఈనేపథ్యంలోనే 50 సంవత్సరాల చరిత్రను బీజేపీ తిరగరాసింది. 1971 లో కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ హాయంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ప్రస్థుతం మోడీ ఆ చరిత్రను తిరగరాశారు. ఈనేపథ్యంలోనే దేశంలోని మొత్తం 29 రాష్ట్రాల్లో 26 రాష్ట్రాల్లో పార్టీకి ప్రాతినిధ్యం లభించగా మొత్తం ఆరు రాష్ట్ర్రాల్లో క్లీన్ స్వీప్ చేయగా, మూడు రాష్ట్రాల్లో మాత్రం బీజేపీకి ప్రాతినిథ్యం లభించని పరిస్థితి నెలకొంది.

మూడు రాష్ట్ర్రాల్లో ఖాత తెరవని బీజేపీ

దేశవ్యాప్తంగా 26 రాష్ట్ర్రాల్లో మోడీ ,అమిత్ షాలు తమ ప్రభావాన్ని చూపించినా దక్షిణాది రాష్ట్ర్రాలైన,కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రాల్లో మాత్రం తన ఖాతాను తెరవలేక పోయింది. కాగా తమిళనాడులో 39 పార్లమెంట్ స్థానాలు ఉండగా, కేరళలో 20, ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. మూడు రాష్ట్ర్రాల్లోని 84 స్థానాల్లో పోటి చేసిన బీజేపీ ఒక్క సీటును కూడ కైవసం చేసుకోలేకపోయింది.

English summary
Congress has not won a single seat in 16 states 3 including the Union Territories.and the congress alliance won the seats below 100 across the country. bjp also have no representaion in three states
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X