వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్చి 1 నుంచి రైలు బోగీలపై రిజర్వేషన్ చార్ట్ కనిపించదు!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మార్చి 1 నుంచి రైలు బోగీలపై రిజర్వేషన్ జాబితాలను అతికించరు. కాగిత రహిత పాలనలో భాగంగా రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయోగాత్మకంగా ఏ1, ఏ, బి శ్రేణి స్టేషన్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

ఈ మేరకు రైల్వే శాఖ అన్ని జోన్లకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆయా స్టేషన్లలో ఎలక్ట్రానిక్ డిజిటల్ డిస్‌ప్లే‌లపై రిజర్వేషన్‌ చార్ట్‌లను ప్రదర్శిస్తున్నందున.. ప్రత్యేకంగా రైలు బోగీలపై జాబితాలను అతికించాల్సిన అవసరం లేదని రైల్వేశాఖ భావన.

No reservation charts in trains from March 1; Railways' pilot project to last 6 months

తెలుగు రాష్ట్రాల్లోని 34 స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ, ఖాజీపేట, ఖమ్మం, మంచిర్యాల, నిజామాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి, సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్లు ఉన్నాయి.

ఇంకా.. పలాస, శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, అనంతపురం, అనకాపల్లి, భీమవరం టౌన్‌, చీరాల, కడప, ఏలూరు, గూడూరు జంక్షన్‌, గుంటూరు జంక్షన్‌, గుంతకల్‌, కాకినాడ టౌన్‌, కర్నూలు టౌన్‌, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, రేణిగుంట, సామర్లకోట, తాడేపల్లిగూడెం, తెనాలి, తుని స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి.

ఆర్థిక క్రమశిక్షణను పాటించడానికి ఈ నూతన విధానం ఉపయోగపడుతుందని, ఇప్పటికే ఈ విధానాన్ని బెంగళూరు డివిజన్ పాటిస్తోందని, ఇక ఏ1, ఏ, బీ క్యాటగిరీ రైల్వేస్టేషన్లలోని అన్ని రైళ్లకు ఈ నూతన విధానాన్ని వర్తింపజేయాలని రైల్వే శాఖ తన ఉత్తర్వుల్లో కోరింది.

English summary
Indian Railways, which has the largest network in the world, plans to save money by doing away with reservation charts on all trains. The Green initiative has already been implemented it in reserved coaches at New Delhi's Hazrat Nizamuddin, Mumbai Central, Chennai Central, Howrah, and Sealdah stations, but now the Ministry of Railways has decided to discontinue this service on all trains for six months.The Ministry of Railway has directed its zones to discontinue pasting reservation charts on reserved coaches of all trains at A1, A and B category stations as a pilot project for six months from March 1, an official statement said on Friday. However, physical and digital display of charts will continue at the platforms, the ministry statement said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X