వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ వర్తించదు: సుప్రీంకోర్టు

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్ల విషయంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువడించింది. ఉద్యోగాల ప్రమోషన్‌పై 2006లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలంటూ దీనిపై ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనంతో విచారణ చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారణ చేసిన ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వర్తించవంటూ ఏకపక్ష నిర్ణయాన్ని వెల్లడించింది. అంతేకాదు 2006లో ఎం. నాగరాజ్ కేసులో బెంచ్ ఇచ్చిన తీర్పును పునఃపరిశీలనకు ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం అవసరం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది.

ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న ఎస్సీఎస్టీలకు సంబంధించిన సమాచారం కూడా ఇకపై సేకరించాల్సిన పనిలేదని వెల్లడించింది అత్యున్నత న్యాయస్థానం. ఆగష్టు 30న విచారణ చేసిన ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో పాటు జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమాన్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ మల్హోత్రాలు సభ్యులుగా ఉన్నారు.

<strong>ఆధార్ కార్డుపై సుప్రీం కోర్టు కీలక తీర్పు</strong>ఆధార్ కార్డుపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

No review of order on SC/ST quota in job promotions says Supreme Court

2006లో జస్టిస్ నాగరాజ్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీర్పును పునఃపరిశీలించాలంటూ కోర్టును ఆశ్రయించాయి. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు వెనకబడి ఉన్నారు కాబట్టి వారి కులాన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగాల్లో ప్రమోషన్లు కల్పించాలని కోర్టును ఆశ్రయించాయి. ఈ క్రమంలోనే ఎం.నాగరాజ్ కేసులో నాటి బెంచ్ ఇచ్చిన తీర్పులో ఎస్సీ ఎస్టీలకు దక్కాల్సిన ఫలాలపై షరతులు విధించిందని దీనిని ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం పునఃపరిశీలించాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

కేంద్రం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదించారు. ఎస్సీ , ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని వాదించారు. వారు వెనకబడి ఉన్నారు కాబట్టి వారికి ప్రమోషన్లు ఇవ్వాలని కోర్టులో వాదించారు. అంతేకాదు పనిచేసే చోట ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు వివక్షకు గురవుతున్నారని వేణుగోపాల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్ ఇవ్వరాదన్న పిటిషనర్ తరపున వాదించారు సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది. ఒకప్పుడు ఎస్సీ ఎస్టీలంటే వెనకబడిన వారు అనే భావన ఉండేదని కానీ ఒక్క సారి ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన తర్వాత అదికూడా అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తి పట్ల వెనకబడినవారు అనే భావన ఉండదని కోర్టుకు తెలిపారు. అయితే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన క్లాస్ ఫోర్, క్లాస్ త్రీ సర్వీసులో ఉన్నవారికి ప్రమోషన్లు కొనసాగించవచ్చని ద్వివేది కోర్టుకు తెలిపారు. పెద్ద సర్వీసుల్లో ఉన్న వారికి ప్రమోషన్ విషయంలో రిజర్వేషన్ వర్తించకూడదని వాదించారు.

English summary
The Supreme Court on Wednesday refused to set up 7-judge bench to review its 2006 order on the SC/ST quota in job promotions.In a unanimous verdict, the apex court ruled that there will be no reservation in promotion for SC/STs in government jobs. “There is a need for quantifiable data to give reservation,” the apex court said.The court concluded the Nagaraj judgement does not need to be referred to a larger bench.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X