వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దటీజ్ నిర్మల!: సర్ అనాలా? మేడమ్ అనాలా? సైనికుల డౌట్, ‘రక్షణమంత్రి అనండి చాలు’..

రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నిర్మలా సీతారామన్ సరిహద్దుల్లో పర్యటిస్తూ జవాన్లను, ఆర్మీ అధికారులను కలుసుకుంటూ భద్రతను సమీక్షిస్తున్నారు. ఇటీవల ఆమె పర్యటన సమయంలో కొంతమంది జవాన్లకు ఓ డౌట్ వచ్చ

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తన పదవికి వన్నె తీసుకొచ్చేలా ప్రవర్తిస్తున్నారు. ఇందిరా గాంధీ తర్వాత రక్షణ శాఖకు పూర్తిస్థాయి మంత్రిగా నియమితులైన రెండో మహిళ నిర్మలా సీతారామన్.

చైనా అభ్యంతరం.. అయినా ఆగని నిర్మలా సీతారామన్!చైనా అభ్యంతరం.. అయినా ఆగని నిర్మలా సీతారామన్!

1975, 1980-82 కాలంలో ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ తాత్కాలిక రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె తర్వాత పూర్తిస్థాయి రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా 58 ఏళ్ల నిర్మలా సీతారామన్ రికార్డులకెక్కారు.

No sir, no memsaab: Nirmala Sitharaman prefers soldiers calling her Raksha Mantri

రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నిర్మలా సీతారామన్ సరిహద్దుల్లో పర్యటిస్తూ జవాన్లను, ఆర్మీ అధికారులను కలుసుకుంటూ భద్రతను సమీక్షిస్తున్నారు. ఇటీవల ఆమె పర్యటన సమయంలో కొంతమంది జవాన్లకు ఓ డౌట్ వచ్చింది.

ఇన్నాళ్లూ రక్షణ మంత్రిగా పురుషులే ఉండేవారు. ఇన్నాళ్లకు మళ్లీ ఆ పదవిని ఒక మహిళ అధిష్టించారు. దీంతో అలవాటు ప్రకారం 'సర్' అని సంబోధించాలా? లేక 'మేడమ్‌' అనాలా? ఇదీ వారి డౌట్.

దీంతో వారు కొన్నిసార్లు సందిగ్ధానికి గురై వివిధ సందర్భాల్లో 'జైహింద్‌ మేమ్‌సాబ్‌' అంటే మరోసారి 'జైహింద్‌ సర్‌' అంటున్నారు. అసలు ఆమెను ఎలా సంబోధించాలో అర్థం కాక ఇలా ఒక్కోరకంగా పిలుస్తున్నారు.

వారి ఇబ్బందులను గుర్తించిన రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ స్పందించారు. తనను సర్‌.. మేడమ్‌.. అని అని పిలవద్దని, కేవలం 'రక్షణ మంత్రి' అంటే చాలని ఆమె సూచించారు.

ఆమెను ఏమని సంబోధించాలో తెలియక గందరగోళానికి గురవుతున్న సైన్యానికి 'రక్షణ మంత్రి' అని పిలవమని చెప్పడం బాగుందని ఓ సీనియర్‌ ఆర్మీ అధికారి వ్యాఖ్యానించారు.

English summary
It didn’t take much time for Nirmala Sitharaman to notice that soldiers seemed confused over how to address India’s first full-time woman defence minister. During her visits to the country’s frontiers over the last two months, Sitharaman has been variously greeted with Jai Hind, memsaab; Jai Hind, sir; and Jai Hind, madam salutations. Officials from her entourage confirmed to the Hindustan Times that many soldiers she interacted with were unsure of the most appropriate address for the minister. “The minister has been addressed as sir, madam and memsaab on different occasions. During informal interactions, some jawans even asked how they should address the minister. The minister said, ‘You can just call me Raksha Mantri please’,” a source said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X