వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకే కాదు ఒడిశాకు కూడా నో స్టేటస్ : లోక్‌సభలో అనురాగ్ స్పష్టీకరణ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా కోసం పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఏపీకి హోదాపై ఇప్పటికే లోక్‌సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఒడిశాకు కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వబోమని తేల్చిచెప్పారు ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్.

నో స్టేటస్ ..
ఒడిశాకు ప్రత్యేక హదాకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు లేవన్నారు అనురాగ్ ఠాకూర్. సోమవారం లోక్ షభలో బీజేపీ ఎంపీ రమేశ్ మాంజీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాలు, పర్వత ప్రాంత రాష్ట్రాలకు ప్రస్తుతం 90 శాతం కేంద్రప్రభుత్వం, 10 శాతం ఆయా రాష్ట్రాల నిధులతో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒడిశాలో కూడా ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలు లేవని స్పష్టంచేశారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక, సాధారణ రాష్ట్రాలను నిర్ణయించడానికి ఎలాంటి విధి విధానాలను ప్రవేశపెట్టలేదని పేర్కొన్నారు.

no status on odisha too.. says anurag takur

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ పలుమార్లు కేంద్రానికి విన్నవించారు. ఈ క్రమంలో ఇదివరకు బీహర్ ఎంపీ కౌసలేంద్ర కుమార్ ప్రత్యేక హోదా గురించి లోక్ సభలో అడిగారు. దీనికి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రణాళిక మద్దతు కోసమే స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని జాతీయాభివృద్ధి మండలి సిఫారసు చేసిందని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు ఆ మండలే మనుగడ లేదని, ఆ సిఫారసులను పాటించబోమని తేల్చిచెప్పారు. దీనికి పారిశ్రామిక రాయితీలతో ఎలాంటి సంబంధం లేదని స్పస్టంచేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 7 రాష్ట్రాలు కోరుతున్నాయి. దీంతో హోదా ఇవ్వబోమని స్పష్టంచేశారు నిర్మలా సీతారామన్.

English summary
Many states are demanding special status. Andhra Pradesh, Odisha and Chhattisgarh are putting pressure on the center. Union Finance Minister Nirmala Sitharaman has already written reply in the Lok Sabha on the status of the AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X