వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో డెత్ నోట్: ఆ రోజు ఐఎఎస్ అధికారి రవి ఏం చేశారు?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కే. రవి ఇంటిలో ఎలాంటి డెత్ నోట్ చిక్కలేదని బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ (లా అండ్ ఆర్డర్) అలోక్ కుమార్ చెప్పారు. బెంగళూరు నగర ఆగ్నేయ విభాగం డీసీపీ రోహిణి ఆధ్వర్యంలో ఐఏఎస్ అధికారి రవి అనుమానస్పద మృతి కేసు దర్యాప్తు చేస్తున్నామని అలోక్ కుమార్ వివరించారు.

బెంగళూరులోని కోరమంగల సమీపంలోని తావరకెరె రోడ్డులోని ప్రిస్టిజ్ గ్రూప్ కు చెందిన సెయింట్ జాన్స్ వుడ్ అపార్ట్ మెంట్ లో డి. కే. రవి నివాసం ఉంటున్నారు. సాయంత్రం ఆయన ఇంటిలో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. ఇంటిలో, ఆయన గదిలో డెత్ నోట్ చిక్కలేదని పోలీసులు తెలిపారు.

ఐఏఎస్ అధికారి రవి మొబైల్, ఇ- మెయిల్ ను పరిశీలించిన తరువాత అందులో ఏమైనా డెత్ నోట్ ఉందా అని విషయం గుర్తించ వలసి ఉందని పోలీసు అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి కోరమంగల సమీపంలోని డి.కే. రవి ఇంటిని పరిశీలించారు. తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ రవి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసిందని చెప్పారు. అయితే కేసు దర్యాప్తులో ఉందని, నిజానిజాలు వెలుగు చూస్తాయని వివరించారు. కాగా, రవి అనుమానాస్పద మృతిపై అఖిల పక్షం ఆధ్వర్యంలో మంగళవారం బంద్ జరుగుతోంది.

No suicide note found in IAS officer DK Ravi house

సోమవారం డి.కే. రవి దినచర్య ఈ విధంగా ఉంది.........!

* అపార్ట్ మెంట్ 903 నెంబర్ ఫ్లాట్ లో రవి భార్య కుసుమాతో కలిసి నివాసం ఉంటున్నారు.
* శనివారం, ఆదివారం నాగరబావిలోని మామ ఇంటిలో రవి, కుసుమా ఉన్నారు.
* సోమవారం నాగరబావిలోని మామ ఇంటి నుండి డి.కే. రవి నేరుగా కోరమంగలోని కార్యాలయానికి వెళ్లారు.
* ఉదయం 10.15 గంటల సమయంలో రవి కార్యాలయానికి చేరుకున్నారు
* ఉదయం 11.15 గంటల సమయంలో కారులో సెయింట్ జాన్స్ వుడ్ అపార్ట్ మెంట్ చేరుకున్నారు
* కారు డ్రైవర్ ను అక్కడే ఉండాలని చెప్పి 9వ అంతస్తులోని ఫ్లాట్ దగ్గరకు వెళ్లారు
* భార్య కుసుమా ఫోన్ చేసినా రవి మొబైల్ లిఫ్ట్ చెయ్యలేదు. కనీసం తిరిగి ఆమెకు ఫోన్ చేసి మాట్లాడలేదు.
* మద్యాహ్నం బోజనం కార్యాలయం దగ్గరకు పంపించాలని రవి ముందుగానే భార్యకు చెప్పి వెళ్లారు.
* రవి చెప్పిన విదంగానే కుసుమా కార్యాలయం దగ్గరకు బోజనం పంపించారు
* మద్యాహ్నం బోజనం పంపించామని చెప్పడానికి కుసుమా ఫోన్ చేశారు. రవి మాత్రం స్పందించలేదు
* మద్యాహ్నం కుసుమా రవి కార్యాలయానికి పోన్ చేశారు. సార్ ఇంటికి వెళ్లారని అక్కడి సిబ్బంది చెప్పారు.
* సాయంత్రం వరకు కుసుమా భర్త రవికి ఫోన్ చేస్తునే ఉన్నారు. అయినా రవి స్పందించలేదు.
* సాయంత్రం కుసుమా తండ్రిని పిలుచుకుని కోరమంగలలోని అపార్ట్ మెంట్ దగ్గరకు బయలుదేరారు.
* కిందనే ఉన్న కారు డ్రైవర్ రవి సార్ ఇంటిలో ఉన్నారని కుసుమాకు చెప్పారు.
* సాయంత్రం 5.45 గంటల సమయంలో ఫ్లాట్ లోకి వెళ్లి చూడగా రవి ఉరి వేసుకున్న స్థతిలో కనిపించారు.
* వెంటనే కుసుమా పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

English summary
No suicide note found in IAS officer DK Ravi house said Bengaluru Additional Police Commissioner Alok Kumar. The police have booked a case of death caused under mysterious circumstances. Ravi the additional commissioner in the commercial taxes department was found dead at his apartment on Monday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X