వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌కు షాక్: 2016కు ముందు సర్జికల్స్ స్ట్రైక్స్ జరగలేదు..ఆర్టీఐకి కేంద్రం సమాధానం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సర్జికల్ స్ట్రైక్స్ మేము చేశామంటే మేము చేశామని పోటీపడుతున్నాయి కాంగ్రెస్ బీజేపీలు. ఎన్నికల వేళ సర్జికల్ స్ట్రైక్స్‌పై ఎవరికి వారు క్రెడిట్ పొందేందుకు చూస్తున్నారు. ఈ క్రమంలోనే 2004 నుంచి 2014 వరకు ముందు ఏమైనా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయా దాని పూర్తి వివరాలు తెలపాలంటూ జమ్ముకశ్మీర్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఆర్టీఐలో పిటిషన్ వేశారు. ఆర్టీఐ ఆ పిటిషన్‌ను రక్షణమంత్రిత్వ శాఖకు పంపించింది. అయితే 2016 కంటే ముందు సర్జికల్ స్ట్రైక్స్ జరిగలేదని రక్షణశాఖ కార్యాలయం ఆర్టీఐ పిటిషన్‌కు సమాధానం ఇచ్చింది.ఇక కేంద్రం ఇచ్చిన సమాధానం కాంగ్రెస్‌లో కలవరపాటుకు గురిచేస్తోంది. తమ హయాంలో ఆరుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేశామని చెప్పిన కాంగ్రెస్‌కు కేంద్రం ఇచ్చిన సమాధానం మింగుడుపడటం లేదు. అయితే ఆర్టీఐకి ఇచ్చిన సమాధానంలో సెప్టెంబర్ 29, 2016న మాత్రమే ఒక సర్జికల్ స్ట్రైక్స్ జరిగినట్లు ఉంది. అది కూడా ఊడి ఘటన తర్వాతే జరిగాయని కేంద్రం అందులో స్పష్టం చేసింది.

జమ్మూకశ్మీర్‌కు చెందిన సామాజిక కార్యకర్త రోహిత్ చౌదరి 2004 నుంచి 2014 మధ్య సర్జికల్ స్ట్రైక్స్ పై పూర్తి వివరాలు కావాలని కోరుతూ ఆర్టీఐలో పిల్ దాఖలు చేశారు. 2016 కంటే ముందు సర్జికల్ స్ట్రైక్స్ పై రక్షణశాఖ కార్యాలయంలో ఎలాంటి సమాచారం లేదని కేంద్రం తెలిపింది. ఇదిలా ఉంటే తమ హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందని రోహిత్ చౌదరి అన్నారు. అసలు ఒక్క సర్జికల్ స్ట్రైక్ కూడా జరగలేదని ఆర్టీఐ ద్వారా తాను సమాచారం పొందినట్లు వెల్లడించాడు.

 No surgical strikes before 2016:Centre replies to RTI

ఈ మధ్యకాలంలో సర్జికల్ స్ట్రైక్స్ పై బీజేపీ కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ పాలనలో సర్జికల్ స్ట్రైక్స్ గురించి మోడీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ వ్యాఖ్యలను ఖండిస్తూ... సర్జికల్ స్ట్రైక్స్ ను ప్రధాని వీడియో గేమ్‌తో పోల్చి మన బలగాలను అవమానించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఇదిలా ఉంటే యూపీఏ హయాంలో 2011లో ఆపరేషన్ జింజర్ పేరుతో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని కొద్ది రోజుల క్రితమే కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ చెప్పారు. అయితే సర్జికల్ స్ట్రైక్స్ అనేవి అదేదో పండగలా చూడరాదని... దేశభద్రత కోసమే అవి జరుగుతాయని సిబల్ వ్యాఖ్యానించారు.అయితే ఇక్కడ అలాంటిదేమీ జరగడం లేదని మన్మోహన్ సింగ్ ఏనాడు సర్జికల్ స్ట్రైక్స్ ప్రస్తావన తీసుకురాలేదని గుర్తుచేశారు. ఓ వైపు జవాన్లు మృతి చెందింతే మరోవైపు మోడీ సర్జికల్ స్ట్రైక్స్ చేశామని అదేదో గొప్పగా భావిస్తున్నారని కామెంట్ చేశారు సిబల్.

English summary
There is no information as such that the surgical strikes took place before 2016 said the centre replying to an RTI filed by a Jammu Kashmir activist. Centre made it clear that only one surgical strike had taken palce in 2016 and that came post the Uri attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X