వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని ప్లేన్‌పై క్షిపణి ప్రయోగించినా తప్పుదారి పట్టిస్తుంది

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇటీవల మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్ 17ను ఉగ్రవాదులు కూల్చిన విషయం తెలిసిందే! అదే దారిలో ప్రయాణించాల్సిన భారత ప్రధాని విమానాన్ని దారి మళ్లించారు. ఈ నేపథ్యంలో మన ప్రధాని విమానం అత్యంత సురక్షితమని ఏవియేషన్ అధికారులు చెబుతున్నారు.

మోడీ ప్రయాణిస్తున్న ఎయిరిండియా వన్‌ విమానం.. ఉక్రెయిన్‌ గగనతలంలో ప్రమాదానికి గురైన మలేషియా విమానం ఎమ్‌హెచ్‌-17 ప్రయాణించిన మార్గంలోనే ప్రయాణించిందని అధికారులు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రమాదవంతమైన ఆప్రాంతంలో ప్రయాణిస్తున్న ప్రధాని విమానం పైకి క్షిపణులు ప్రయోగించినా ప్రమాదం లేదా? అంటే అధికారులు అవుననే అంటున్నారు.

No threat to PM's aircraft!

2009లో ప్రధాని, వీవీఐపీల ప్రయాణం కోసం భారత వైమానిక దళం రూ.936.93 కోట్లు వెచ్చించి 46 సీట్ల సామర్థ్యం ఉన్న మూడు బోయింగ్‌ బిజినెస్‌ జెట్‌ (బీబీజే)లను కొనుగోలు చేసింది. వాటిలో మరో 200 కోట్లు వెచ్చించి క్షిపణి దాడులను పసిగట్టి దాడుల నుంచి రక్షించే ఎలకా్ట్రనిక్‌ కౌంటర్‌మెజరర్స్‌ (ఈసీఎమ్‌) వ్యవస్థను ఏర్పాటు చేసింది.

క్షిపణి ప్రయోగ స్థావరం నుంచి క్షిపణిని ప్రయోగించిన వెంటనే కాక్‌పిట్‌లోని రాడార్‌ వ్యవస్థ దానిని పసిగట్టిన వెంటనే ఈసీఎమ్‌.. క్షిపణిని తప్పుదారి పట్టించేలా సంకేతాలను విడుదల చేస్తుందట. దేశ ప్రధాని విమానం పైకి వదిలిన క్షిపణి సైతం ఈసీఎమ్‌తో చిన్నబోవాల్సిందేనట

English summary
Government said there was no threat to Air Force One, the aircraft that flew PM back from Germany over the airspace where Malaysian Airlines plane was shot down.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X