వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ టిటిడి సభ్యుడు శేఖర్ రెడ్డికి సహకరించిందెవరో?

మాజీ టిటిడి సభ్యుడు, కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డికి ,ఆయన సహచరులకు 34 కోట్ల రూపాయాల పాత నగదును కొత్త నగదును మార్చుకొనేందుకు సహకరించిన అధికారులు ఎవరనే విషయాన్ని ఇంకా తేల్చలేదు సిబిఐ అధికారులు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై :మాజీ టిటిడి సభ్యుడు, కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డికి ,ఆయన సహచరులకు 34 కోట్ల రూపాయాల పాత నగదును కొత్త నగదును మార్చుకొనేందుకు సహకరించిన అధికారులు ఎవరనే విషయాన్ని ఇంకా తేల్చలేదు సిబిఐ అధికారులు.ఈ విషయమై ఇంకా విచారణ సాగిస్తున్నారు.

సిబిఐ అధికారులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు మూడు కేసులను శేఖర్ రెడ్డిపై మూడు కేసులను నమోదు చేశారు. శేఖర్ రెడ్డితో పాటు మరి కొందరరు సన్నిహితులపై కూడ కేసులను నమోదు చేశారు సిబిఐ అధికారులు.

no trace of bankers who aided Sekhar Reddy

శేఖర్ రెడ్డిని గత ఏడాది డిసెంబర్ 21వ, తేదిన అరెస్టు చేశారు. అయితే ఇంతవరకు శేఖర్ రెడ్డికి సహకరించిన అధికారులు ఎవరనే విషయాన్ని ఇంకా నిర్ధారించలేదు. అయితే ప్రభుత్వాధికారులు మాత్రం శేఖర్ రెడ్డికి సహకరించారనే అనుమానాలను సిబిఐ వ్యక్తం చేస్తోంది.

శేఖర్ రెడ్డి ఇప్పటికే రెండు దఫాలుగా అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. కోల్ కత్తాకు చెందిన వ్యాపారి లోథా ను కూడ అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు సిబిఐ అధికారులు.అయితే ఇంతవరకు వీరి వెనుక ఉన్న ప్రభుత్వ అధికారులు ఎవరనేది ఇంతవరకు తేల్చలేదు.

శేఖర్ రెడ్డితో పాటు ఆయన సన్నిహితుల ఇండ్లలో దాడులు నిర్వహించి సుమారు 131 కోట్ల నగదును స్వాధీనం చేసుకొన్నారు.అయితే ఇందులో 34 కోట్ల కొత్త నోట్లున్నాయి. 177 కిలోల బంగారం కూడ ఉంది.

English summary
after hitting the headlines following the arrest of sand don Sekhar Reddy, cbi sleuths seem to be groping in the dark as they are unable to trace bank officials who had helped him and his associates swap rs 34 crore worth old notes into new notes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X